AAP MLA manhandled : ఎమ్మెల్యేని.. పరిగెత్తించి మరీ కొట్టిన కార్యకర్తలు!-aap mla allegedly manhandled over mcd polls ticket distribution issue ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Aap Mla Allegedly Manhandled Over Mcd Polls Ticket Distribution Issue

AAP MLA manhandled : ఎమ్మెల్యేని.. పరిగెత్తించి మరీ కొట్టిన కార్యకర్తలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 07:10 AM IST

AAP MLA manhandled : ఢిల్లీలో.. ఆప్​ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన్ని పరిగెత్తించి మరీ కొట్టారు..!

ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న కార్యకర్తలు
ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న కార్యకర్తలు (Twitter)

AAP MLA manhandled : ఓ ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలు పరిగెత్తించి మరీ కొట్టిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్​ సింగ్​ యాదవ్​పై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక ఎన్నికల్లో టికెట్లు అమ్ముతుండటంతోనే ఈ ఘటన జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

మతైలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్​ సింగ్​ యాదవ్​.. సోమవారం రాత్రి శ్యామ్​ విహార్​కు వెళ్లారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికే అక్కడి వాతావరణం వేడెక్కింది. కార్యకర్తలు.. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. గులాబ్​ సింగ్​ కాలర్​ పట్టుకుని కొట్టారు.

Gulab Singh Yadav news : చేసేదేమీ లేక.. ఆప్​ ఎమ్మెల్యే గులాబ్​ సింగ్​.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. కానీ ఆయన్ని కార్యకర్తలు వెంబడించారు. పరిగెడుతున్న ఎమ్మెల్యేను పట్టుకుని కొట్టారు! అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి తప్పించుకోగలిగారు.

ఎమ్మెల్యేపై కార్యకర్తలు ఎందుకు కోపడ్డారు? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల కోసం ఎమ్మెల్యే.. టికెట్లు అమ్మేందుకు వెళ్లారని, ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది.

Attack on Gulab Singh Yadav : "డ్రామాలు చేస్తున్న పార్టీకి సంబంధించిన దృశ్యాలు ఇవి. నిజాయితీ రాజకీయాలు చేస్తున్నామంటూ.. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను సొంత కార్యకర్తలే విడిచిపెట్టడం లేదు. రానున్న ఎంసీడీ ఎన్నికల్లో ఇలాంటివి చాలా జరుగుతాయి," అని బీజేపీకి చెందిన సంబిత్​ పాత్ర ట్వీట్​ చేశారు.

మరోవైపు.. కార్యకర్తల నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే గులాబ్​ సింగ్​ యాదవ్​.. సమీపంలోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. వైద్యులు ఆయన్ని పరీక్షించారు. పెద్దగా గాయాలవ్వలేదని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

మరోవైపు.. బీజేపీ ఆరోపణలను గులాబ్​ సింగ్​ యాదవ్​ ఖండించారు.

Party workers attacked MLA : "బీజేపీ రెచ్చిపోతోంది. టికెట్ల అమ్మకం గురించి తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నాపై దాడి చేసిన వారిని రక్షించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీని మీడియా నిలదీయాలి," అని ట్వీట్​ చేశారు గులాబ్​ సింగ్​.

ఎంసీడీ టికెట్లను ఆప్​ అమ్ముతోందని పలుమార్లు ఆరోపించింది బీజేపీ. ఇందుకు సంబంధించి.. సోమవారం ఉదయం ఓ వీడియోను కూడా విడుదల చేసింది. టికెట్​కు రూ. 80వేల వరకు వసూలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం, ఆప్​ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ ఖండించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point