AAP defeats BJP for first time: ఆప్ బీజేపీని ఓడించింది ఇదే తొలిసారి తెలుసా?-aap defeats bjp for first time big win in key delhi polls ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Aap Defeats Bjp For First Time, Big Win In Key Delhi Polls

AAP defeats BJP for first time: ఆప్ బీజేపీని ఓడించింది ఇదే తొలిసారి తెలుసా?

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 09:51 PM IST

MCD results key points: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 17 ఏళ్ల బీజేపీ పాలనకు ఢిల్లీ ప్రజలు ముగింపు పలికారు. మొత్తం 250 వార్డులకు గానూ, 134 సీట్లలో ఆప్ విజయం సాధించింది.

ఆప్ సంబురాల్లో కేజ్రీవాల్ వేషధారణలో ఒక చిన్నారి
ఆప్ సంబురాల్లో కేజ్రీవాల్ వేషధారణలో ఒక చిన్నారి (PTI)

MCD results key points: ఈ సారి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అవేంటో చూద్దామా..?

ట్రెండింగ్ వార్తలు

  • ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమితమైంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 30 సీట్లలో విజయం సాధించింది.
  • ఎన్నికల రాజకీయంలోకి ప్రవేశించిన తరువాత.. ఆమ్ ఆద్మీ పార్టీ, అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడం ఇదే తొలిసారి. గతంలో గెలిచిన ఎన్నికల్లో ఆప్ ఓడించింది కాంగ్రెస్ నే కానీ, బీజేపీని కాదు. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్, అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. అంటే, ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని ఆప్ ఓడించలేదు. ఈ ఎంసీడీ ఎన్నికల్లో మాత్రమే తొలిసారి అధికారంలో ఉన్న బీజేపీని ఆప్ ఓడించింది. గతంలో బీజేపీ ఆప్ ను విమర్శిస్తూ.. ఆప్ బీజేపీని ఎన్నడూ ఓడించలేదని వ్యాఖ్యానించేది. ఈ విషయాన్ని బుధవారం ఆప్ నేత సంజయ్ సింగ్ గుర్తు చేస్తూ.. బీజేపీకి కేజ్రీవాల్ సరైన సమాధానం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
  • గత 24 ఏళ్లలో ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై మాత్రం గత 17 ఏళ్లుగా ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 స్థానాలకు గానూ, 67 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత, 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ 270 సీట్లకు గానూ 181 స్థానాల్లో విజయం సాధించి, ఎంసీడీ(MCD)పై ఆధిపత్యం నిలబెట్టుకుంది.
  • సంవత్సరం క్రితం నుంచే ఆప్ ప్రచారం ప్రారంభించింది. మోదీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తరహాలో.. ‘కేజ్రీవాల్ కీ సర్కార్..కేజ్రీవాల్ కీ కార్పొరేటర్’ అనే నినాదం చేపట్టింది.

WhatsApp channel

టాపిక్