Aam Aadmi Challenge: బీజేపీకి “డిగ్రీ దిఖావో” సవాల్ విసిరిన ఆమ్ఆద్మీ పార్టీ: వివరాలివే
Aam Aadmi Party Degree Dikhaao Challenge: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆమ్ఆద్మీ పార్టీ సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. రాజకీయ నాయకులు డిగ్రీ సర్టిఫికేట్లు చూపించాలంటూ డిగ్రీ దిఖావోకు శ్రీకారం చుట్టింది.

Aam Aadmi Party Degree Dikhaao Challenge: ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య డిగ్రీల రచ్చ కొనసాగుతూనే ఉంది. రాజకీయ నేతలు డిగ్రీ సర్టిఫికేట్లు చూపించాలంటూ “డిగ్రీ దిఖావో”(Show Your Degree)” కార్యక్రమాన్ని ఆప్ మొదలుపెట్టింది. బీజేపీ నాయకులు కూడా ఇలా చేయాలని చాలెంజ్ విసిరింది. ప్రధాని నరేంద్ర మోదీ విదార్హతపై చర్చ జరుగుతుండగానే.. ఆప్ కొత్త క్యాంపెయిన్‍ను ప్రారంభించింది. వివరాలివే.
Aam Aadmi Party Degree Dikhaao Challenge: ఆమ్ఆద్మీ ఎమ్మెల్యే, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi) ఈ డిగ్రీ దిఖావో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం మీడియా ముందు తన డిగ్రీ సర్టిఫికేట్లను ఆమె ప్రదర్శించారు. బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లను చూపించాలని అన్నారు. ప్రధాని మోదీ డిగ్రీ వివరాల గురించి ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‍కు ఇటీవల గుజరాత్ హైకోర్టు రూ.25వేల జరిమానా వేసింది. ఇది జరిగిన వారం తర్వాత ఇప్పుడు ఆప్ ఈ డిగ్రీ దిఖావో క్యాంపెయిన్ తీసుకొచ్చింది.
సర్టిఫికేట్లు చూపిన మంత్రి
Aam Aadmi Party Degree Dikhaao Challenge: “మేం నేడు ఓ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. మీ నాయకులు ఇప్పటి నుంచి ప్రతీ రోజు మీకు (ప్రజలకు) డిగ్రీలు చూపిస్తారు. నాకు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ ఉంది. ఆక్స్‌ఫర్డ్ నుంచి రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినల్” అని మీడియా సమావేశంలో అతిషి అన్నారు. తన డిగ్రీ సర్టిఫికేట్లను చూపించారు.
“డిగ్రీలను చూపించాలని నేను నాయకులందరినీ అడుగుతున్నా.. ముఖ్యంగా బీజేపీ వారిని” అని ఆమె అన్నారు.
ఎల్‍జీ కూడా డిగ్రీ చూపాలి
Aam Aadmi Party Degree Dikhaao Challenge: ఐఐటీల నుంచి డిగ్రీలు పొంది కూడా కొందరు నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఈ కామెంట్లపై అతిషి స్పందించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ (IIT)ల వంటి వాటి సమగ్రతను ప్రశ్నించటం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఐఐటీల బ్రాండ్ నేమ్‍పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు నియామకాలు చేసుకుంటున్నాయి. కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు ఉన్నారు. అలాంటి విద్యాసంస్థల విశ్వసనీయతను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. తమ సొంత డిగ్రీలను దాచి పెట్టాలని అనుకునే వారే.. ఇతరుల డిగ్రీల గురించి ప్రశ్నిస్తారు. ఎల్‍జీ కూడా డిగ్రీని చూపించాలని నేను అప్పీల్ చేస్తున్నా” అని అతిషి అన్నారు.
సంబంధిత కథనం