Aakash: రూ.137 కోట్ల బంగ్లాను కొనుగోలు చేసిన ఆకాశ్ చౌదరి
Aakash Educational services limited: ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ చౌదరి రూ. 137 కోట్ల విలువైన బంగ్లా కొనుగోలు చేశారు.
బెంగళూరు: బైజు యాజమాన్యంలోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి కౌటిల్య మార్గ్‌లో గల డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్ బంగ్లాను రూ. 137 కోట్లకు కొనుగోలు చేశారు. ఇటీవలి కాలంలో అతిపెద్ద వ్యక్తిగత ఆస్తి లావాదేవీలలో ఇదొకటిగా నిలిచింది.
1293.47 చదరపు మీటర్ల ఈ స్థిరాస్తి ఆగస్టు 1న రిజిస్టరైంది. చౌదరి రూ. 8.22 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు జాప్‌కీలో అందుబాటులో ఉన్న పత్రాలు వెల్లడించాయి. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఆస్తి రిజిస్ట్రేషన్ డేటాను ఈ జాప్‌కీ క్రోఢీకరిస్తుంది.
దేశంలోని అత్యంత విలువైన స్టార్టప్ మేజర్ బైజూస్ ట్యుటోరియల్ చైన్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఏప్రిల్ 2021లో ప్రకటించారు. దీనివిలువను 950 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఏఈఎస్ఎల్ ప్రమోటర్లు కంపెనీలో మైనారిటీ వాటాను కలిగి ఉన్నారు.
అయితే ఈ ఏడాది జూలైలో మాత్రమే ఏఈఎస్ఎల్‌కు చెల్లించాల్సిన చెల్లింపులను పూర్తి చేసినట్లు బైజూస్ తెలిపింది. సదరు ఆస్తి లావాదేవీపై ఇమెయిల్ ప్రశ్నకు చౌదరి స్పందించలేదు.
గతంలో రెండు లావాదేవీలలో భాగంగా ఏఈఎస్ఎల్ వ్యవస్థాపకుడు జేసీ చౌదరి దక్షిణ ఢిల్లీలో సుమారు రూ. 96 కోట్లతో ఒక ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. అంతకు ముందు దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో రూ. 100 కోట్లకు పైగా విలువ చేసే 2,000 చదరపు గజాల ఆస్తిని కొనుగోలు చేశారు.
ఇటీవల బైజూస్ కొనుగోలు చేసిన ఎడ్‌టెక్ స్టార్టప్ Toppr వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జిషాన్ హయత్ సబర్బన్ ముంబైలోని ఉన్నత స్థాయి బాంద్రా ప్రాంతంలో 4,000 చదరపు అడుగుల సీ ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను రూ. 41 కోట్లకు కొనుగోలు చేశారు.
ప్రాపర్టీ అడ్వైజరీ సావిల్స్ ఇండియా ప్రకారం ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలోని హై-ఎండ్, లగ్జరీ రెసిడెన్షియల్ సెగ్మెంట్లు మూలధన విలువలలో స్థిరమైన వృద్ధిని సాధించాయి.
గత కొన్ని త్రైమాసికాల్లో ఢిల్లీ లుటెన్స్, దక్షిణ భాగంలో కొన్ని విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. విలాసవంతమైన అంతస్తుల కోసం డిమాండ్ కూడా పెరిగింది.
2022 జూన్ త్రైమాసికంలో టైర్ 1 నగరాల్లోని అన్ని హౌసింగ్ యూనిట్ల సరఫరాలో భారతదేశంలోని లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ వాటా 12 శాతానికి పెరిగినట్టు పరిశోధనా సంస్థ ప్రాప్ ఈక్విటీ ఓ నివేదికలో తెలిపింది.