ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఏఏఐ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 53 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ ఈనెల 21న ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 20, 2023గా నిర్దేశించారు. ఖాళీల వివరాలు, అర్హతలు మీకోసం..
అభ్యర్థులు విద్యార్హతలను ఏఏఐ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్దేశించిన సమగ్ర నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఆయా పోస్టులకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు.
ఏఏఐ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందుకోసం అడ్మిట్ కార్డు జారీచేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను వడపోసి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షకు పిలుస్తారు.
ఏఏఐ నోటిఫికేషన్ సమగ్ర వివరాల కోసం ఈ కిందఇచ్చిన పీడీఎఫ్‌లో నోటిఫికేషన్ చూడండి.