Google Search: ట్రంప్ గెలిచాక అమెరికన్లు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది ఏంటో తెలుసా?-a massive 1 500 percent surge in google searches for moving abroad after trumps win ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Google Search: ట్రంప్ గెలిచాక అమెరికన్లు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది ఏంటో తెలుసా?

Google Search: ట్రంప్ గెలిచాక అమెరికన్లు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది ఏంటో తెలుసా?

Sudarshan V HT Telugu
Nov 09, 2024 08:18 PM IST

Google Search: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత అమెరికాలో ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసిన టాపిక్ ఏంటో తెలుసా? ఆ టాపిక్ పై సెర్చ్ లు ట్రంప్ విజయం తరువాత 1,514 శాతం పెరిగాయట. ట్రంప్ గెలిచాక దేశం విడిచి వెళ్లడం గురించి అమెరికన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట.


ట్రంప్ గెలిచాక అమెరికన్లు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్
ట్రంప్ గెలిచాక అమెరికన్లు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్

Google Search: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (donald trump) విజయం సాధించిన తర్వాత అమెరికాలో గూగుల్ లో ఎక్కువ మంది ‘దేశం విడిచి వెళ్లడం’ అనే అంశంపై ఎక్కువగా సెర్చ్ చేశారట. ట్రంప్ విజయం తరువాత ఆ టాపిక్ పై గూగుల్ (google) సెర్చ్ లు అసాధారణంగా 1516% పెరిగాయట. ట్రంప్ విజయం తరువాత అమెరికా విడిచి వేరే దేశాల్లో సెటిట్ కావడానికి అమెరికన్లలో పెరుగుతున్న ఆసక్తిని ఈ సెర్చ్ ట్రెండ్స్ ప్రతిబింబిస్తాయని VisaGuide.World నివేదిక తెలిపింది.

ఈ దేశాలపై ఆసక్తి

నవంబర్ 5 మరియు నవంబర్ 6 మధ్య ఇమ్మిగ్రేషన్ సంబంధిత సెర్చ్ ల పెరుగుదల ముఖ్యంగా గుర్తించదగినది. ముఖ్యంగా అమెరికాను విడిచి వేరే దేశాల్లో సెటిల్ కావాలనుకునే వారిలో కూడా చాలామంది కొన్ని దేశాల పైననే ఆసక్తి చూపారు. ఆ దేశాలేంటో ఇక్కడ చూడండి.

కోస్టారికా: కోస్టారికాకు వెళ్లడానికి సంబంధించిన సెర్చ్ ల్లో 302 శాతం పెరుగుదల.

నార్వే: నార్వేకు వెళ్లడానికి సంబంధించిన సెర్చ్ లు 437 శాతం పెరిగాయి.

ఐర్లాండ్: ఐర్లాండ్కు మకాం మార్చడానికి అమెరికన్లలో ఆసక్తి 355 శాతం పెరిగింది.

యునైటెడ్ కింగ్ డమ్: యూకేలో సెటిల్ కావడానికి ఉన్న అవకాశాలపై 375 శాతం సెర్చ్ లు పెరిగాయి.

విదేశాల్లో సెటిల్ కావాలనుకునే అమెరికన్లకు ఈ దేశాలు టాప్ ఆప్షన్స్ గా నిలిచాయని నివేదిక తెలిపింది.

ఇమ్మిగ్రేషన్ కీ వర్డ్స్

ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన అత్యంత ప్రాచుర్యం పొందిన సెర్చ్ పదాలు, కీ వర్డ్స్ అమెరికన్ల గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా కనిపించాయి. వాటిలో ‘‘యుఎస్ నుండి న్యూజీలాండ్ కు మకాం మార్చడం’’ అనే కీ వర్డ్ నమ్మశక్యం కాని విధంగా 7,600 శాతం పెరుగుదలను చూసింది. ఇది ఈ మధ్య కాలంలో అత్యధికంగా శోధించిన పదంగా నిలిచింది. అలాగే, "అమెరికా నుండి జర్మనీకి వెళ్లడం" అనే పదం సెర్చ్ లు 4,200 శాతం పెరిగాయి. ఇవి కాకుండా..

  • "నెదర్లాండ్స్ కు మకాం మార్చడం": ఈ పదం సెర్చింగ్ 3,233 శాతం పెరిగింది.
  • "ఐర్లాండ్ కు మకాం మార్చడం": 2,400 శాతం పెరిగింది.
  • "ఐరోపాకు మకాం మార్చడం": 1,566 శాతం పెరిగింది.
  • "న్యూజీలాండ్ కు వలస": 1,566 శాతం పెరిగింది.
  • "ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు": 1,328 శాతం పెరిగాయి.
  • "నార్వేకు మకాం మార్చడం": 1,150 శాతం పెరిగింది.
  • "ఆస్ట్రేలియాకు మకాం మార్చడం": 1,150 శాతం పెరుగుదలను చూసింది.
  • "పోర్చుగల్ కు మకాం మార్చడం": 1,100 శాతం పెరిగింది.
  • ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, అధిక జీవన ప్రమాణాలు ఉన్న దేశాలకు అమెరికన్లు ప్రాధాన్యత ఇస్తున్నారని వారి సెర్చ్ ల ద్వారా తెలుస్తోంది.

అమెరికన్లు పరిశీలిస్తున్న ముఖ్య దేశాలు

పునరావాసం కోసం అమెరికన్లు పరిశీలిస్తున్న అగ్ర దేశాల జాబితాను VisaGuide.World సంకలనం చేసింది. ఈ దేశాలను మూడు సమూహాలుగా వర్గీకరించారు. అవి ఆంగ్లం మాట్లాడే దేశాలు, ఐరోపా దేశాలు, ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలు.

ఇంగ్లిష్ మాట్లాడే దేశాలు: కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా

VisaGuide.World: ఐర్లాండ్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, నెదర్లాండ్స్

ఇతర ప్రజాదరణ పొందిన దేశాలు: కోస్టారికా, మెక్సికో

Whats_app_banner