25 hours in a day : 'ఇక రోజుకు 25 గంటలు'- ఈ మార్పే కారణం అంటున్న శాస్త్రవేత్తలు..!
‘ఇక రోజుకు 25 గంటలు’ అని చదువుకునే రోజులు రావొచ్చు! ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు కారణాన్ని కూడా వివరిస్తున్నారు.ే
ఇప్పుడంటే రోజుకు 24 గంటలు ఉన్నాయి. కానీ రానున్న కాలంలో ఇక రోజుకు 25 గంటలు ఉండే అవకాశం ఉంది! ఈ విషయంతో చాలా మంది శాస్త్రవేత్తలు ఏకీభవిస్తున్నారు. ఇందుకు కారణం.. భూమి నుంచి చంద్రుడి నిదానంగా దూరం జరిగిపోతుండటం!
రోజుకు 25 గంటలు..!
చంద్రుడు అంతకంతకూ దూరమవుతుండటంతో భూమిపై ఒక రోజుకు 24 గంటలు బదులు, 25 గంటలు అవొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, చంద్రుడు సంవత్సరానికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు.
భూమి నుంచి చంద్రుడు నిదానంగా వెనక్కి జరిగిపోతుండటం వల్ల 200 మిలియన్ సంవత్సరాల కాలంలో భూమికి రోజులో 25 గంటలు ఉండే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.
వాస్తవానికి భూమికి రోజుకు 24 గంటలే లేవు! 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు కేవలం 18 గంటలు మాత్రమే ఉండేది!
గురుత్వాకర్షణ శక్తి..
భూమి నుంచి చంద్రుడు వెనక్కి జరుగుతుండటానికి, రోజుకు 25 గంటలు అయ్యేందుకు ఒక ప్రాధమిక కారణం.. రెండింటి గురుత్వాకర్షణ పరస్పర చర్యలు అని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలోని జియోసైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ అభిప్రాయపడ్డారు.
"చంద్రుడు దూరంగా కదులుతున్నప్పుడు, భూమి ఒక స్పిన్నింగ్ ఫిగర్ స్కేటర్ లాగా ఉండి, నెమ్మదిస్తుంది. రెండు స్ట్రెచ్ అవుతుంటాయి," అని మేయర్స్ చెప్పారు.
గతంలో కాలాన్ని చెప్పేందుకు 'ఆస్ట్రోక్రోనాలజీ'ని ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఆధునిక భౌగోళిక ప్రక్రియలను అధ్యయనం చేసే విధానంతో పోల్చదగిన రీతిలో బిలియన్ల సంవత్సరాల నాటి శిలలను అధ్యయనం చేయాలనుకుంటున్నామని మేయర్ చెప్పారు.
చంద్రుడు దూరంగా జరగడం కొత్తేమీ కాదు..!
చంద్రుడు దూరంగా జరగడం, రోజులో గంటలు పెరగడం వంటివి చాలా సంవత్సరాలుగా మనిషికి తెలిసినప్పటికీ, విస్కాన్సిన్ పరిశోధన ఈ ఫినామినాకు సంబంధించిన చారిత్రక, భౌగోళిక నేపథ్యాన్ని లోతుగా పరిశీలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పురాతన భౌగోళిక నిర్మాణాలు, అవక్షేప పొరల (సెడిమెంట్ లేయర్స్)ని పరిశీలించడం ద్వారా పరిశోధకులు భూమి-చంద్ర వ్యవస్థ చరిత్రను ట్రాక్ చేయగలిగారు.
చంద్రుడి ప్రస్తుత కదలిక రేటు సాపేక్షంగా స్థిరంగా ఉందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే వివిధ కారణాల వల్ల అది భౌగోళిక కాలవ్యవధుల్లో హెచ్చుతగ్గులకు లోనైంది. భూమి పరిభ్రమణ వేగం, ఖండాంతర డ్రిఫ్ట్ వంటివి ప్రధానమైనవిగా గుర్తించారు.
సంబంధిత కథనం