Road accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - 9 మంది దుర్మరణం
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు.
9 people died in an accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్, కెఎంఎఫ్ పాల వాహనం ఢీకొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం అర్సికెరె తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో జరిగింది. మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
రాత్రి సమయంలో…
శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మిల్క్ ట్యాంకర్, టెంపో ట్రావెలర్ మాత్రమే కాకుండా... ఆర్టీసీ బస్సు కూడా ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులంతా టెంపో ట్రావెలర్ లో ప్రయాణిస్తున్న వారే అని వెల్లడించారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురు ఆస్పత్రికి తరలించే మార్గంలో ప్రాణాలు విడిచారని పోలీసులు వివరించారు. గాయపడిన మరో 10 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనాస్థలిని హాసన్ జిల్లా ఎస్పీ హరీరామ్ శంకర్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.