Indian family kidnapped in the US: భారతీయ కుటుంబం కిడ్నాప్-8monthold baby among 4 member indian origin family kidnapped in us ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  8-month-old Baby Among 4-member Indian-origin Family Kidnapped In Us

Indian family kidnapped in the US: భారతీయ కుటుంబం కిడ్నాప్

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 10:33 PM IST

Indian family kidnapped in US: అమెరికాలో భారతీయ కుటుంబం కిడ్నాప్ కు గురైంది. కిడ్నాప్ కు గురైన వారిలో 8 నెలల చిన్నారి కూడా ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Indian family kidnapped in US: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న మెర్స్ డ్ కౌంటీలోని సెంట్రల్ వ్యాలీలో నివసించే జస్దీప్ సింగ్ కుటుంబాన్ని సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Indian family kidnapped in US: 8 నెలల చిన్నారి

జస్దీప్ సింగ్, ఆయన భార్య జస్లీన్ కౌర్, వారి 8 నెలల కూతురు ఆరూహీ ధేరి, ఆ పాప మేనమామ అమన్ దీప్ సింగ్ లు సోమవారం కిడ్నాప్ నకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన వారి వివరాలు తెలియరాలేదని, వారి వద్ద నుంచి ఎలాంటి డిమాండ్లతో ఫోన్ కాల్ రాలేదని పోలీసులు తెలిపారు.

Indian family kidnapped in US: ప్రమాదకర ఆయుధాలు

అయితే, వారి వద్ద ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని, గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడవద్దని ఆ ప్రాంతంలోని వారికి పోలీసులు సూచించారు. అయితే, అరెస్ట్ చేసింది ఒక్క వ్యక్తేనా, లేక గ్రూప్ గా వచ్చారా? అన్న విషయంలోనూ స్పష్టత లేదన్నారు. కిడ్నాప్ చేసిన ఒక వ్యక్తి నున్నటి గుండుతో, హుడీ ధరించి ఉన్నాడని వివరించారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ఫొటోను కూడా విడుదల చేశారు.

IPL_Entry_Point