HMPV cases in India : ఇండియాలోకి హెచ్​ఎంపీవీ- బెంగళూరులో రెండు కేసులు..-8monthold at bengaluru hospital is first suspected hmpv case in india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hmpv Cases In India : ఇండియాలోకి హెచ్​ఎంపీవీ- బెంగళూరులో రెండు కేసులు..

HMPV cases in India : ఇండియాలోకి హెచ్​ఎంపీవీ- బెంగళూరులో రెండు కేసులు..

Sharath Chitturi HT Telugu

HMPV Bengaluru : బెంగళూరులో హెచ్​ఎంపీవీ కలకలం సృష్టించింది! 3 నెలల శిశువు, 8 నెలల శిశువుకు హెచ్​ఎంపీవీ పాజిటివ్​గా తేలినట్టు అధికారులు ధ్రువీకరించారు.

బెంగళూరులో హెచ్​ఎంపీవీ అనుమానిత కేసు (Representational Image)

చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్​ఎంపీవీ (హ్యూమన్​ మెటాన్యుమోవైరస్​) తాజాగా భారత్​లోకి ప్రవేశించింది! బెంగళూరులో రెండు కేసులు నమోదైనట్టు సోమవారం తెలిసింది. 3 నెలల శిశువు, 8 నెలల శిశువుకు హెచ్​ఎంపీవీ పాజిటివ్​గా తేలినట్టు సమాచారం.

ఉత్తర బెంగళూరులోని బాప్టిస్ట్​ హాస్పిటల్​లో హెచ్​ఎంపీవీకి సంబంధించిన ఈ రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, హెచ్​ఎంపీవీకి గురైన శిశివులు, లేదా కుటుంబసభ్యులకు ఎలాంటి అంతర్జాతీయ పర్యటన హిస్టరీ లేకపోవడం ఆందోళనకు గురిచేసే మరో విషయం.

శిశువుల నమూనాలను ల్యాబ్​కి పంపించగా, పాజిటివ్​ అని తేలినట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది.

"ఒక ప్రైవేట్​ ఆసుపత్రి నుంచి టెస్టింగ్​ రిపోర్టులు వచ్చాయి. శిశువులకు హెచ్​ఎంపీవీ పాజిటివ్​గా తేలింది. ప్రైవేటు ఆసుపత్రి పరీక్షా విధానాలపై మాకు సందేహాలు లేవు. అయితే ఈ వైరస్​ స్ట్రెయిన్​ ఏంటి? అనేది తెలియదు. చైనాలో ఏ స్ట్రెయిన్​ ఉందో తెలియకపోవడంతో ఈ వైరస్​ స్ట్రెయిన్​ గురించి కూడా చెప్పలేము," అని కర్ణాటక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

హెచ్ఎంపీవీ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ కేసుల్లో ఈ వైరస్​ వాటా 0.7శాతం.

చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) వ్యాప్తిపై ఊహాగానాల మధ్య, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఇటీవలే చెప్పారు.

హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) వ్యాప్తిపై భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే తెలిపింది. శ్వాసకోశ వ్యాధులను నిర్వహించడానికి భారతదేశం "బాగా సిద్ధంగా ఉంది" అని, చైనాలో పరిస్థితి "అసాధారణం కాదు" అని పేర్కొంది.

హెచ్ఎంపీవీ అంటే ఏమిటి?

చైనాలో పుట్టిన ఈ హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ) దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని కథనాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారుతున్నాయి. చైనాలోని ఆసుపత్రులు హెచ్ఎంపీవీ సహా శ్వాసకోశకు సంబంధించిన రోగులతో నిండిపోయాయని అనేక వీడియోలు సూచిస్తున్నాయి. హెచ్ఎంపీవీ, ఇన్​ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్ -19 వంటి వైరస్​ల ఔట్​బ్రేక్​ కారణంగా ఆసుపత్రులుస శ్మశానవాటికల్లో రద్దీ నెలకొందని చైనా నుంచి వస్తున్న వీడియోల్లో చూడవచ్చు.

అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం.. నెదర్​ల్యాండ్స్​లోని పరిశోధకులు 2001లో మొదటిసారి గుర్తించిన ఈ హెచ్ఎంపీవీ.. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ముఖ్యమైన కారణం! వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధం ద్వారా, దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాస బిందువుల ద్వారా లేదా డోర్నాబ్స్ లేదా బొమ్మలు వంటి కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.

హెచ్ఎంపీవీ సాధారణంగా శీతాకాలం, వసంత నెలల్లో అమెరికాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

హెచ్ఎంపీవీ లక్షణాలు..

హెచ్ఎంపీవీ లక్షణాలు తీవ్రత బట్టి మారవచ్చు. సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, గొంతు నొప్పిని కలిగి ఉంటాయి. కొంతమంది శ్వాస ఆడకపోవడం వంటివి లక్షణాలుగా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, సంక్రమణలో భాగంగా దద్దుర్లు అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.