7th pay Commission : కేంద్ర ఉద్యోగులకు 2 నెలల ఏరియర్స్ పడేది ఎప్పుడంటే..
7th pay Commission : కేంద్ర ప్రభుత్వం.. తమ ఉద్యోగులకు ఇటీవలే డీఏని హైక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు.. పెరిగిన జీతాలు ఎప్పుడు పడతాయి? అన్న విషయంపై వార్త బయటకి వచ్చింది.
7th pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. పెరిగిన జీతాలు.. మార్చి 30న అందే అవకాశం ఉందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో మార్చి 31 ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలిచ్చిన తరుణంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే తాజా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) లెక్కిస్తారు.
డీఏ ఏరియర్స్..
కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపును ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇది.. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా అలవెన్స్ 46శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల ఏరియర్స్ ఉంటాయి.
హెచ్ ఆర్ ఏ సంగతేంటి?
Central government arrears news : డీఏతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కూడా పెరుగుతుందని, నగర వర్గీకరణను బట్టి ఉద్యోగులకు 30 శాతం వరకు హెచ్ఆర్ఏ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ కేర్ అలవెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ, ట్రాన్స్ఫర్ ట్రావెల్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, గ్రాట్యుటీ సీలింగ్, మైలేజ్ అలవెన్స్ వంటి ఇతర ప్రత్యేక అలవెన్సులు కూడా పెరగవచ్చు. అయితే ఉద్యోగులు ఈ అలవెన్సులను తదనుగుణంగా క్లెయిమ్ చేసుకోవాలి.
చివరిసారిగా డీఏ పెంపు ఎప్పుడు జరిగింది?
2023 అక్టోబర్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) నాలుగు శాతం పెరిగింది. ఫలితంగా.. డీఏ 46 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందారు.
7th pay Commission arrears : అయితే.. ఏరియర్స్ పడటంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం