Republic Day: అబ్బురపరిచిన విన్యాసాలు.. ఆకట్టుకున్న శకటాలు: 45 విమానాలతో ఎయిర్‍షో: రిపబ్లిక్ డే పరేడ్‍లో ప్రత్యేకతలు ఇవే-74th republic day parade highlights all women contingent to agniveers know specialties ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  74th Republic Day Parade Highlights All Women Contingent To Agniveers Know Specialties

Republic Day: అబ్బురపరిచిన విన్యాసాలు.. ఆకట్టుకున్న శకటాలు: 45 విమానాలతో ఎయిర్‍షో: రిపబ్లిక్ డే పరేడ్‍లో ప్రత్యేకతలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 26, 2023 01:41 PM IST

74th Republic Day Parade on Kartavya Path: ఢిల్లీలోని కర్తవ్యపథ్‍పై రిపబ్లిక్ డే పరేడ్ నేడు అత్యంత వైభవోపేతంగా జరిగింది. కవాతులు, సాయుధ దళాల విన్యాసాలు, ఆయుధాల ప్రదర్శన, శకటాలు ఆకట్టుకున్నాయి. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

Republic Day: అబ్బురపరిచిన విన్యాసాలు.. ఆకట్టుకున్న శకటాలు
Republic Day: అబ్బురపరిచిన విన్యాసాలు.. ఆకట్టుకున్న శకటాలు (ANI Photo)

Republic Day 2023 Parade: దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ నేడు (జనవరి 26) అట్టహాసంగా జరిగింది. కర్తవ్యపథ్‍లో ముందుగా జాతీయ జెండాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆవిష్కరించారు. దీంతో రిపబ్లిక్ డే పరేడ్ మొదలైంది. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా ఇల్ సిసి.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. భారత సాయుధ దళాల అపార సామర్థ్యం, సాంస్కృతి వైవిధ్యం, సమ్మేళనం, మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ పరేడ్ జరిగింది. నవభారతం, అత్మనిర్భర్ భారత్ అంశాలకు ప్రతీకగా పరేడ్ సాగింది. సైనిక విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో కేవలం భారత్‍లోనే తయారైన ఆయుధాల వ్యవస్థల ప్రదర్శన జరిగింది. ఇది ఎంతో ప్రత్యేకతగా నిలిచింది. ఇలా ఈ పరేడ్‍లో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

మహిళా దళం

Republic Day 2023 Parade: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తరఫున మహిళా దళం పరేడ్‍లో కవాతు నిర్వహించింది. పూర్తి మహిళలతో కూడిన బృందం (All-Women Contingent) రిపబ్లిక్ డే పరేడ్‍లో కవాతు నిర్వహించడం ఇదే తొలిసారి.

దేశీయ ఆయుధాలు మాత్రమే..

Republic Day 2023 Parade: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‍లో కేవలం దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల వ్యవస్థలనే భారత సాయుద దళాలు ప్రదర్శించాయి. ఈసారి రష్యా యుద్ధ ట్యాంకులు కూడా లేవు. తొలిసారి ఇలా ఏ విదేశీ ఆయుధాలు లేకుండా రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్‍ను ఇది ప్రతిబింబించింది.

అగ్నివీరులు

Republic Day 2023 Parade: రిపబ్లిక్ డే పరేడ్‍లో అగ్నివీరులు మొదటిసారి పాలుపంచుకున్నారు. నావికా దళ బృంద కవాతులో ఆరుగురు అగ్నివీరులు కూడా పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

Republic Day 2023 Parade: భారత వైమానిక దళం (Indian Air Force) విన్యాసాలు రిపబ్లిక్ డే పరేడ్‍లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎయిర్ ఫోర్స్ కు చెందిన 48 విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వీటితో పాటు ఆర్మీ (Indian Army), నేవి (Indian Navy) దళాలు కూడా విన్యాసాలు చేశాయి. త్రివిధ దళాల విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

17 రాష్ట్రాల శకటాలు

Republic Day 2023 Parade: ఆంధ్రప్రదేశ్‍తో పాటు మొత్తంగా 17 రాష్ట్రాల శకటాలు పరేడ్‍లో ప్రదర్శనకు వచ్చాయి. నారీశక్తి థీమ్‍తో రూపొందిన శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రభల తీర్థం వేడుకను ప్రతిబింబిస్తూ రూపొందిన ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేకతగా నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ శాఖల శకటాలు కూడా పరేడ్ కు వచ్చాయి.

సిగ్నల్స్ డేర్ డెవిల్స్ కాప్స్ బృందం నిర్వహించిన మోటార్ బైక్ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.

Republic Day 2023 Parade: సాయుద దళాల బృందాల కవాతు, ఆర్మీ, నేవి, వాయుసేనల విన్యాసాలు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరిన్ని వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జాతీయ గీతాలాపనతో పరేడ్ ముగిసింది.

IPL_Entry_Point