6G rollout: త్వరలోనే ఇండియాలో 6జీ కూడా.. విజన్ స్టేట్మెంట్ ఇంకా ఏం చెబుతోంది?-6g rollout in the next few years says pm modi unveils the 6g vision document ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  6g Rollout In The Next Few Years, Says Pm Modi, Unveils The 6g Vision Document

6G rollout: త్వరలోనే ఇండియాలో 6జీ కూడా.. విజన్ స్టేట్మెంట్ ఇంకా ఏం చెబుతోంది?

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 05:01 PM IST

6G rollout: రానున్న 2, 3 సంవత్సరాలలో భారత్ లో 6జీ (6G) సేవలు కూడా ప్రారంభమవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ANI)

6G rollout: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 6జీ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత్ లోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ (5G) సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు 5 జీ సర్వీసెస్ ను అందిస్తామని టెలీకాం కంపెనీలు చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

6G rollout: డిజిటల్ విప్లవం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే భారత్ లో 5 జీ (5G) సేవలు అత్యంత వేగంగా విస్తరించాయన్నారు. కేవలం 4 నెలల్లో మొత్తం 125 నగరాలు, పట్టణాల్లో 5జీ (5G) సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మోదీ బుధవారం పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన ‘కాల్ బిఫోర్ యూ డిగ్ (Call before u Dig)’ అనే యాప్ ను కూడా ఆవిష్కరించారు.

6G rollout: త్వరలో 6జీ

త్వరలో 6 జీ (6G) సేవలను అందించడానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మార్చి 22న ఆవిష్కరించిన 6జీ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా దేశంలో 6 జీ సేవల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ 6 జీ (6G) విజన్ డాక్యుమెంట్ ను భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్ అండ్ డీ సంస్థలు, విద్యాసంస్థలు, టెలీకాం సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ రూపొందించింది.

WhatsApp channel