65 year old cremated by roadside : శ్మశానవాటిక లేక.. రోడ్డు పక్కనే వృద్ధుడి దహన సంస్కారాలు..!
65 year old cremated by roadside : గ్రామంలో శ్మశానం లేకపోవడంతో.. ఓ వృద్ధుడికి రోడ్డు పక్కనే దహన సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లాలో జరిగింది.

65 year old cremated by roadside : కర్ణాటకలోని రామనగర జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో.. ఓ వృద్ధుడికి రోడ్డు పక్కనే దహన సంస్కారాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది!
ఇదీ జరిగింది..
కర్ణాటక బెంగళూరుకు సమీపంలో ఉండే రామనగర జిల్లాల్లోని కొనముద్దనహళ్లి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. 65ఏళ్ల రుద్రయ్య.. ఆదివారం ఉదయం మరణించాడు. కానీ ఆ గ్రామంలో శ్మశానం లేకపోవడంతో ఆయనకు అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలో కుటుంబసభ్యులకు అర్థం కాలేదు. వారికి సొంతంగా భూమి కూడా లేదు.
No land for cremation : "స్థానిక యంత్రాంగం, తహసిల్దారు, డిప్యూటీ కమిషనర్, ప్రజాప్రతినిధులకు చాలాసార్లు సమస్యను చెప్పాము. కానీ గ్రామంలో సరైన శ్మశానాన్ని రూపొందించేందుకు ఎవరూ చర్యలు తీసుకోలేదు," అని గ్రామ ప్రజలు మీడియాకు చెప్పారు.
గ్రామానికి సమీపంలో ఉండే చెరువు వద్ద దహస సంస్కారాలు నిర్వహించేవారు గ్రామస్థలు. కానీ అక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి.
రుద్రయ్య అత్యంక్రియలను.. చెరువు ఎదురుగా ఉన్న భూమిలో నిర్వహించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. కానీ అది తమ భూమి అని ఓ వ్యక్తి, వారిని అక్కడి నుంచి పంపించేశాడు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని కూడా చూపించాడు. ఫలితంగా.. ఆ ఖాళీ ప్రాంతాన్ని శ్మశానంగా వాడుకోలేకపోయారు.
ఇక వేరే ఆప్షన్ లేకపోవడంతో.. రుద్రయ్య మృతదేహానికి.. రోడ్డు పక్కనే దహన సంస్కారాలు నిర్వహించారు గ్రామస్థులు.
ఎందుకు ఈ పరిస్థితి?
Konamuddanahalli village : ఆ గ్రామంలో 250 కుటుంబాలు ఉంటాయి. సొంతంగా దహన సంస్కారాలు నిర్వహించుకునేందుకు వీరి వద్ద తగిన భూమి లేదు. అంత్యక్రియల కోసం గతంలో సరైన ప్రభుత్వ భూమిని గ్రామస్థులు గుర్తించారు. తమ అభ్యర్థనను ప్రభుత్వ అధికారుల ముందు ఉంచారు. కానీ.. వాటి ఎవరూ పట్టించుకోలేదు.
"13 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కానీ దానిని మరో వ్యక్తి ఆక్రమించాడు. శ్మాశానం కోసం వేరే భూమి కావాలని గ్రామస్థులు అడుగుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు," అని కూట్గల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి హెచ్టీకి వివరించారు.
ఈ ఘటనపై రామనగర తహసిల్దారు బీ తేజస్విని స్పందించారు. అధికారులను అక్కడికి పంపిస్తామన్నారు.
"కొనముద్దనహళ్లి గ్రామం వచ్చే కూట్గల్ గ్రామ పంచాయతీకి 13 గుంటల భూమిని ఇచ్చాము. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు నేను అధికారులను పంపిస్తాను," అని తేజస్వీ అన్నారు.
Konamuddanahalli village cremation land : శ్మశానం లేకపోవడంతో వృద్ధుడు అంత్యక్రియలు రోడ్డు పక్కనే నిర్వహించాల్సి వచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు ఈ ఒక్క గ్రామంలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఆఖరి మజిలీ అవస్థలపై కథనాలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఇది చాలా బాధాకరమైన విషయం అని అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కానీ పెద్దగా మార్పులు కనిపించవు.
సంబంధిత కథనం