Jammu twin blasts : వరుస పేలుళ్లతో ఉలిక్కిపడ్డ జమ్ము.. ఏడుగురికి తీవ్ర గాయాలు!-6 injured in twin jammu blasts amid high alert for rahul gandhi s bharat jodo yatra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  6 Injured In Twin Jammu Blasts Amid High Alert For Rahul Gandhi's Bharat Jodo Yatra

Jammu twin blasts : వరుస పేలుళ్లతో ఉలిక్కిపడ్డ జమ్ము.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 21, 2023 01:31 PM IST

Twin blasts in Jammu Kashmir : జమ్ముకశ్మీర్​లో వరుస పేలుళ్లు సంభవించాయి. జమ్ము ప్రాంతంలో జరిగిన ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడ్డారు.

పేలుడు సంభవిచిన ప్రాంతంలో పోలీసులు
పేలుడు సంభవిచిన ప్రాంతంలో పోలీసులు

Twin blasts in Jammu Kashmir : వరుస పేలుళ్లతో జమ్ముకశ్మీర్​ ఉలిక్కిపడింది! జమ్ము రైల్వేస్టేషన్​కు సమీపంలో శనివారం ఉదయం ఈ పేలుళ్లు సంభవించాయి. భారత్​ జోడో యాత్ర ప్రస్తుతం జమ్ముకశ్మీర్​లో ఉండటంతో.. తాజా పరిణామాల మధ్య కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

15 నిమిషాల వ్యవధిలో..

జమ్ములోని నర్వాల్​ ప్రాంతంలో 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగినట్టు జమ్ము అడిషనల్​ డైరక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్​ ముకేష్​ సింగ్​ తెలిపారు. రెండు వాహనాల్లో ఐఈడీలను అమర్చినట్టు, అవి పేలినట్టు మీడియాకు వివరించారు. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడినట్టు, వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు స్పష్టం చేశారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు.

Jammu Twin blasts today : పేలుళ్ల నేపథ్యంలో.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. వాహనాలను ఆపి, క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

మరోవైపు.. ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్​ జోడో యాత్ర, రిపబ్లిక్​ డే నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్​లో ఉన్న ప్రాంతంలోనే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.

శనివారం ఉదయం 10:45 గంటలకు మొదటి పేలుడు జరిగింది. రీపేరు కోసం వార్క్​షాప్​కు పంపించిన వాహనంలో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్టు పేర్కొన్నారు. 15 నిమిషాల తర్వాత.. జరిగిన మరో పేలుడులో మరో ఇద్దరు గాయాలపాలైనట్టు వివరించారు.

మాజీ ఎమ్మెల్యే నివాసంలో..

జమ్ముకశ్మీర్​ పూంచ్​లోని ఓ మాజీ ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయలవ్వలేదు.

Jammu explosion today : ఈ పేలుడు ఘటనలో.. సురంకోటె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ గుజ్జర్​ నేత చౌదరి మొహమ్మద్​ అక్రమ్​ కుటుంబసభ్యులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటన జరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేరు.

"ఘటన జరిగినప్పుడు నేను ఇంట్లో లేను. కొద్దిసేపటి తర్వాత నాకు సమాచారం అందింది. శక్తివంతమైన పేలుడు సంభవించిందని తెలిసింది. ఆ తర్వాత కొందరు దుండగులు ఇంట్లోకి కాల్పులు జరిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం, భారత సైన్యం.. మా ఇంటికి వచ్చాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాయి," అని అక్రమ్​ తెలిపారు.

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి గులాన్​ నబీ ఆజాద్​కు సంఘీభావంగా.. కాంగ్రెస్​ నుంచి బయటకొచ్చారు అక్రమ్​. కానీ.. ప్రస్తుతం ఆయన ఆజాద్​ స్థాపించిన డెమొక్రెటిక్​ ఆజాద్​ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు.

మరోవైపు.. తన ఇంట్లో పేలుడు ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అక్రమ్​ డిమాండ్​ చేశారు.

ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ కాట్రిడ్జ్​లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం