Monkeypox : మంకీపాక్స్ సోకిన ఆ 22 ఏళ్ల యువతిని ఢిల్లీలోని LNJP Hospitalలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచామని ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.,Monkeypox : ఐదు కేసులుఢిల్లీలో శనివారం నాటికి మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. అయతే, వీరిలో ఒకరు చికిత్స అనంతరం ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రి నుంచి డిస్చార్జై ఇంటికి వెళ్లిపోయారు. నైజీరియాకు వెళ్లివచ్చిన మహిళకు తాజాగా ఈ వైరస్ సోకింది. అయితే, నెల క్రితం నైజీరియా నుంచి వచ్చిన ఆ మహిళకు మంకీ పాక్స్ సోకడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.,Monkeypox : జులై 24న తొలి కేసుఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు ఈ సంవత్సరం జులై 24న నమోదైంది. అంతకుముందు రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మంకీపాక్స్‌ను Public Health Emergencyగా ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విదేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదైంది. జులై 14న కొల్లాం జిల్లాలో ఈ కేసు నమోదైంది.