Telugu News  /  National International  /  5 People Shot Dead In Disputed Area Along Assam-meghalaya Border
అస్సాం, మేఘాలయ సరిహద్దు
అస్సాం, మేఘాలయ సరిహద్దు

5 people shot dead along Assam-Meghalaya border: అస్సాం, మేఘాలయాల మధ్య ఉద్రిక్తత

22 November 2022, 23:30 ISTHT Telugu Desk
22 November 2022, 23:30 IST

5 people shot dead along Assam-Meghalaya border: అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. రెండు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో ఐదుగురు మేఘాలయ వాసులను అస్సాం ఫారెస్ట్ గార్డ్ లు కాల్చి చంపారు.

5 people shot dead along Assam-Meghalaya border: అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం సాగుతోంది. ఈ మార్చి నెలలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ(అస్సాం), కన్రాడ్ సంగ్మా చర్చలు జరిపి, ఈ వివాదంపై ఒక ఒప్పందానికి వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

5 people shot dead along Assam-Meghalaya border: ఐదుగురి దుర్మరణం

తాజాగా, వివాదాస్పద ప్రాంతం నుంచి కలప తీసుకుని వస్తున్న ఐదుగురు మేఘాలయ వాసులు తుపాకీ కాల్పులకు బలయ్యారు. వారిని అస్సాం ఫారెస్ట్ గార్డ్ లు కాల్చి చంపారని మేఘాలయ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఉండడం కోసం మేఘాలయలోని 7 సరిహద్దు జిల్లాల్లో, అస్సాంలోని 5 సరిహద్దు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. సమాచారం తెలియగానే మేఘాలయ సీఎం సంగ్మా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

5 people shot dead along Assam-Meghalaya border: ఫారెస్ట్ గార్డులే చంపారు..

మేఘాలయ వాసులను అస్సాం ఫారెస్ట్ గార్డులే కాల్చి చంపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొదట కలపతో వస్తున్న వారి వాహనం టైర్లపై కాల్చారని, ఆ తరువాత విచక్షణారహితంగా ఆ వాహనంలోని వారిపై కాల్పులు జరిపారని వెల్లడించారు. వాహనంలోని వారి ప్రతిదాడిలో ఒక ఫారెస్ట్ గార్డ్ కూడా చనిపోయినట్లు సమాచారం.

Assam-Meghalaya border dispute: 884 కిమీల సరిహద్దు

రెండు రాష్ట్రాల మధ్య గత ఐదు దశాబ్దాలుగా ఈ సరిహద్దు వివాదం ఉంది. ఈ మార్చి నెలలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా చర్చలు జరిపి, మొత్తం 12 వివాదాస్పద భూభాగల్లోని 5 భూభాగాలకు సంబంధించిన ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య 884.9 కిమీల మేర సరిహద్దు ఉంది. మార్చిలో కుదిరిన ఒప్పందం ద్వారా దాదాపు 70% భూభాగానికి సంబంధించిన సమస్య పరిష్కారమైందని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే, తాజా ఘటనలో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది.