Dornier Aircraft | పిచ్చుకలా ఎగిరే అతిచిన్న విమానం.. మేడ్ ఇన్ ఇండియా!
ఇప్పటి వరకు డోర్నియర్ 228 విమానాలను సాయుధ దళాలు మాత్రమే ఉపయోగించాయి. పౌర విమానయానం కోసం వినియోగించడం ఇదే తొలిసారి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే 'ఆలియన్స్ ఎయిర్' ఈ ఎయిర్ క్రాఫ్ట్ సివిల్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది.
మొట్టమొదటి 'మేడ్-ఇన్-ఇండియా' డోర్నియర్ కమర్షియల్ విమానం అస్సాం నుంచి బయలుదేరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన డోర్నియర్ 228 విమానం మంగళవారం తూర్పు అస్సాంలోని దిబ్రూఘడ్ నుంచి సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌కు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ విమానానికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
అస్సాంలోని దిబ్రూఘడ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ వరకు చేరుకొని, అక్కడ్నించి తిరిగి అస్సాంలోని లీలాబరీ వరకు ఈ విమానం నడుస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటి వరకు డోర్నియర్ 228 విమానాలను సాయుధ దళాలు మాత్రమే ఉపయోగించాయి. పౌర విమానయానం కోసం వినియోగించడం ఇదే తొలిసారి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే 'ఆలియన్స్ ఎయిర్' ఈ ఎయిర్ క్రాఫ్ట్ సివిల్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది.
డోర్నియర్ విమానానికి సంబంధించిన 5 ఆసక్తికర విషయాలు
- డోర్నియర్ 228 అనేది ట్విన్-టర్బోప్రాప్ షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ యుటిలిటీ ఎయిర్‌క్రాఫ్ట్. దీనిని భారత సాయుధ దళాలు ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , ఇండియన్ నేవీ అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది.
- ఈ విమానాలను పౌరయానం కోసం వినియోగించేందుకు భారతీయ ఎయిర్‌లైన్స్ ఆధీనంలోని 'అలయన్స్ ఎయిర్' సంస్థ రెండు 17-సీటర్ డోర్నియర్ 228 విమానాలను లీజుకు తీసుకుంది. ఇందుకోసం గత ఫిబ్రవరి నెలలో HALతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో మొదటి డోర్నియర్ 228 విమానాన్ని ఏప్రిల్ 7న అందుకుంది.
- పర్వతశ్రేణులతో నిండిన ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచేందుకు తేలికైన, చిన్న డోర్నియర్ 228 విమానాలు అనువైనవని 'అలయన్స్ ఎయిర్' భావించింది. ఎట్టకేలకు అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్‌లను కలుపుతూ అస్సాంలోని దిబ్రూఘర్ - అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ మధ్య కమర్షియల్ సర్వీస్ ప్రారంభించింది.
- ఈ మేడ్-ఇన్-ఇండియా డోర్నియర్ 228 విమానంలో ఇద్దరు సిబ్బంది, 17 మంది ప్రయాణికులు ఉంటారు. దీని రెక్కలు 16.97 మీ, మొత్తం పొడవు 16.56 మీ కాగా, ఎత్తు 4.86 మీటర్లు. వైమానిక సర్వే, కాలుష్య నివారణ, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, ప్రయాణికుల రవాణా, దళాలను రవాణా చేయడం, కార్గో, లాజిస్టిక్స్ సపోర్ట్ తదితర అవసరాల కోసం ఈ విమానాన్ని ఉపయోగించవచ్చు.
- HAL ప్రకారం, డోర్నియర్ 228 అనేది అత్యంత బహుముఖమైన, బహుళ-ప్రయోజనాలు కలిగిన, అత్యంత తేలికైన రవాణా విమానం.
సంబంధిత కథనం