Godown collapses in Delhi | ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ కు చెందిన ఒక పెద్ద గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో అక్కడ పనిలో ఉన్న కార్మికులు ఆ గోడ కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, 9 మంది వరకు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.,Godown collapses in Delhi | భారీ గోడఅలీపూర్ ప్రాంతంలో ఒక భారీ గోడౌన్ నిర్మాణం జరుగుతోంది. ఆ గోడౌన్‌కు ఆనుకుని దాదాపు 100 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు గోడ ఉంది. ఆ గోడ పక్కన కూలీలు పునాది కోసం తవ్వకాలు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఆ గోడ పెద్ద శబ్దంపై పడిపోయింది. ఆ భారీ గోడ కూలిపోవడంతో, దాని శిధిలాల కింద దాదాపు 25 మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు.,Godown collapses in Delhi | ఐదుగురు మృతిఆ శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిలో ఐదుగురు చనిపోయారు. 9 మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జేసీబీలతో శిధిలాలను తొలగిస్తున్నారు.,Godown collapses in Delhi | ప్రధాని, ఢిల్లీ సీఎం సంతాపంప్రమాదంలో ఐదుగురు చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబ సభ్యలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని కోరారు. ఆ నిర్మాణం చేపట్టిన శక్తిసింగ్‌పై కేసు నమోదు చేశారు.