Crime news: ‘నాన్నే అమ్మను చంపాడు’: డ్రాయింగ్ వేసి చూపిన నాలుగేళ్ల బాలిక-4yearold girl draws alleged murder of mother says pappa killed mumma ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: ‘నాన్నే అమ్మను చంపాడు’: డ్రాయింగ్ వేసి చూపిన నాలుగేళ్ల బాలిక

Crime news: ‘నాన్నే అమ్మను చంపాడు’: డ్రాయింగ్ వేసి చూపిన నాలుగేళ్ల బాలిక

Sudarshan V HT Telugu
Published Feb 18, 2025 03:47 PM IST

Crime news: భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రించాలనుకున్న ఒక దుర్మార్గుడి ఆలోచనను వారి 4 ఏళ్ళ కూతురు బట్టబయలు చేసింది. తన తల్లిని తన తండ్రే హత్య చేశాడని డ్రాయింగ్ వేసి మరీ చూపింది. దాంతో, ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

‘నాన్నే అమ్మను చంపాడు’
‘నాన్నే అమ్మను చంపాడు’

Crime news: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన తండ్రి తన తల్లిని హత్య చేశాడని ఆమె నాలుగేళ్ల కూతురు తన డ్రాయింగ్ ద్వారా వివరించింది. తమ కూతురిని కొన్నేళ్లుగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, చివరకు హత్య చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యూపీలోని ఝాన్సీలో ఉన్న కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివ్ పరివార్ కాలనీలో ఈ సంఘటన జరిగింది.

ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం

ఆ బాధిత 27 ఏళ్ల యువతిని ఆమె భర్త హత్య చేసినట్లు ఆ యువతి నాలుగేళ్ల కూతురు వాంగ్మూలం ద్వారా పోలీసులు నిర్ధారించారు. తన తల్లిని హత్య చేసి, ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆ చిన్నారి వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాకుండా, సంబంధిత ఘటనను డ్రాయింగ్ వేసి చూపింది. ‘‘నాన్న మమ్మీని కొట్టి చంపేశాడు. రాయితో తలపై కొట్టాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఉరివేశాడు. అనంతరం మృతదేహాన్ని కిందకు దించి గోనె సంచిలో పడేశాడు’’ అని ఆ నాలుగేళ్ల పాప పోలీసులకు తెలిపింది. గతంలో కూడా తన తల్లిని చంపేస్తానని తన తండ్రి పలుమార్లు బెదిరించాడని బాలిక పేర్కొంది. ‘‘నా తల్లికి పట్టిన గతే నాకు కూడా పడుతుందని నన్ను బెదిరించాడు’’ అని వివరించింది. తాను చూసిన సంఘటనల చిత్రాన్ని కూడా ఆ బాలిక గీసింది. అనంతరం, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మహిళ మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. భర్తను అరెస్టు చేసి మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

బాధిత యువతి తండ్రి వాంగ్మూలం

టికమ్ గఢ్ జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి మాట్లాడుతూ తన కుమార్తె, సందీప్ 2019లో వివాహం చేసుకున్నారని, అయితే అప్పటి నుంచి తన కూతురిని అతడు, అతడి కుటుంబ సభ్యులు వేధించేవారని చెప్పారు. పెళ్లి రోజు కట్నంగా రూ.20 లక్షల నగదు ఇచ్చానని, ఆ వెంటనే సందీప్, అతని కుటుంబ సభ్యులు కారుతో సహా మరిన్ని డిమాండ్లు చేయడం ప్రారంభించారని వివరించారు. వారికి కారు కొనడం నా శక్తికి మించిన పని అని చెప్పాను. ఆ తర్వాత అతను, అతని కుటుంబం నా కుమార్తెపై వేధింపులు మరింత పెంచారు. నేను పోలీసులను కూడా ఆశ్రయించాను. ఆ తరువాత వారు రాజీకి వచ్చారు" అని ఆయన చెప్పారు.

కొడుకు పుట్టలేదని..

పెళ్లయిన సంవత్సరం తరువాత ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. మహిళ అత్తమామలు కొడుకు పుట్టలేదని హింసించడం ప్రారంభించారు. ఆమె ఆడ పిల్లకు జన్మనిచ్చిందని తిట్టిపోశారు. ప్రసవం తర్వాత కూడా వారు ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ యువతి తండ్రి బిల్లులు చెల్లించి తన ఇంటికి తీసుకువెళ్లాడు.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.