Ayodhya Ram Temple: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న 45 వేల కిలోల లడ్డూలు-45 tonne of laddoos being prepared for ram temple pran prathishtha distribution ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Temple: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న 45 వేల కిలోల లడ్డూలు

Ayodhya Ram Temple: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న 45 వేల కిలోల లడ్డూలు

HT Telugu Desk HT Telugu
Jan 14, 2024 07:44 PM IST

45 tonne of laddoos for Ram Temple pran prathishtha: అయోధ్యలో జనవరి 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమానికి వస్తున్న అతిథులకు పంపిణీ చేయడం కోసం భారీగా లడ్డూలు సిద్ధమవుతున్నాయి.

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతున్న 45 టన్నుల లడ్డూలు
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతున్న 45 టన్నుల లడ్డూలు (PTI)

45 tonne of laddoos for Ram Temple pran prathishtha: రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అతిథులు, భక్తులకు పంపిణీ చేయడానికి 45 వేల కిలోల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఈ లడ్డూలతో పాటు ఇతర మతపరమైన వస్తువులను ఈ వేడుక సందర్భంగా రామ మందిరాన్ని సందర్శించే భక్తులకు పంపిణీ చేయనున్నారు.

వారణాసి బృందం

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ (Ram Temple pran prathishtha) కార్యక్రమం సందర్భంగా ఈ లడ్డూలను సకాలంలో సిద్ధం చేసేందుకు వారణాసికి చెందిన మిఠాయిలు తయారు చేసే ప్రత్యేక బృందం 24 గంటలు పనిచేస్తోంది. ఈ లడ్డూలతో పాటు ఇతర మతపరమైన వస్తువులను రామ మందిరానికి (Ram Temple pran prathishtha) వచ్చే భక్తులకు పంపిణీ చేయనున్నారు. అయోధ్య ఆలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి వరకు ఈ లడ్డూల తయారీ కొనసాగనుంది. ఈ లడ్డూలు ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని, వీటికి మూడు నుంచి నాలుగు నెలల పాటు షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెబుతున్నారు.

ఈ లడ్డూ స్పెషాలిటీ..

శనగపిండితో పాటు యాలకులు, జీడిపప్పు, కుంకుమపువ్వు, స్వచ్ఛమైన దేశీ నెయ్యి తదితర ఆహ్లాదకరమైన రుచులతో ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లడ్డూను రూపొందించడంలో స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఉపయోగించామని తయారీ దారులు చెబుతున్నారు. కిలో శెనగపిండికి కిలో పంచదార, కిలో దేశీ ఆవు నెయ్యి కలుపుతున్నామని తెలిపారు. "ఇది బెనారస్ (వారణాసి) నుండి వచ్చిన ప్రసిద్ధ వంటకం" అని గర్వంగా చెప్పారు.

ప్రసాదంతో పాటు ఏమేం ఇస్తారు?

అతిథులందరికీ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు రతన్ లాల్ అగర్వాల్ అనే మిఠాయి వ్యాపారి తెలిపారు. లడ్డూలతో పాటు ప్రసాదం ప్యాకెట్లో 'రామ్' పేరుతో అలంకరించిన పుస్తకం, జోలా, చున్నీ ఉంటాయి. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలకు శ్రీరాముడి స్టిక్కర్, అయోధ్య ఆలయ చిత్రణతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన టిఫిన్ బాక్స్ కూడా అందనుంది.

Whats_app_banner