4 Maoists killed in encounter: ఎన్ కౌంటర్ లో నలుగురు మావోల మరణం-4 maoists killed in gunfight with security forces in chhattisgarh s bastar police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  4 Maoists Killed In Gunfight With Security Forces In Chhattisgarh's Bastar: Police

4 Maoists killed in encounter: ఎన్ కౌంటర్ లో నలుగురు మావోల మరణం

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 08:53 PM IST

4 Maoists killed in encounter: చత్తీస్ గఢ్ లోని బస్తర్ అడవుల్లో శనివారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

4 Maoists killed in encounter: చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు నక్సలైట్లు చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

4 Maoists killed in encounter: సమాచారం అందడంతో గాలింపు

చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ‘‘బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అడవిలో మావోయిస్ట్ పార్టీ డివిజనల్ కమిటీ సభ్యులు మోహన్ కడ్తి, సుమిత్ర తో పాటు సుమారు 40 మంది మావోలు సమావేశమైనట్లు సమాచారమందింది. దాంతో పోలీసు దళాలు కూంబింగ్ ప్రారంభించాయి. మావోలు ఉన్న ప్రాంతం సమీపానికి వెళ్లిన పోలీసులపై మావోలు కాల్పులు జరిపారు. దాంతో, పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా ఎదురుకాల్పులు కొనసాగాయి. ఆ తరువాత ఆ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు కనిపించాయి’’ అని పోలీసులు వివరించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఆ నలుగురు మావోలు వివరాలు ఇంకా తెలియరాలేదని వివరించారు.

4 Maoists killed in encounter: జాయింట్ ఆపరేషన్

ఈ ఆపరేషన్ ను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్((DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్((STF), సీఆర్పీఎఫ్(CRPF) సంయుక్తంగా నిర్వహించాయి. మావోల సమాచారం రాగానే, టీమ్ లుగా ఏర్పడి, తెల్లవారు జాము నుంచే గాలింపు చేపట్టామని, అనంతరం, ఉదయం 7.30గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా పూర్తవలేదని, గాలింపు కొనసాగిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. చనిపోయిన నక్సలైట్లు వాడిన .303 రైఫిల్, 315 బోర్ రైఫిల్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

WhatsApp channel