Kerala model gang raped : కదులుతున్న కాారులో.. 19ఏళ్ల యువతిపై అత్యాచారం!-4 held for raping young model inside car in kerala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  4 Held For 'Raping' Young Model Inside Car In Kerala

Kerala model gang raped : కదులుతున్న కాారులో.. 19ఏళ్ల యువతిపై అత్యాచారం!

కదులుతున్న కాారులో 19ఏళ్ల యువతిపై అత్యాచారం!
కదులుతున్న కాారులో 19ఏళ్ల యువతిపై అత్యాచారం!

Kerala model gang raped : 19ఏళ్ల మోడల్​ సామూహిక అత్యాచారానికి గురైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆమెను.. కదులుతున్న కారులో రేప్​ చేశారు.

Kerala model gang raped : కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 19ఏళ్ల యువతి.. సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి.. నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

19ఏళ్ల యువతి మోడలింగ్​లో కెరీర్​ కొనసాగిస్తోంది. కాగా.. గురువారం రాత్రి, కొచిన్​ షిప్​యార్డ్​కు సమీపంలోనే ఓ పబ్​కు వెళ్లింది. అక్కడ మద్యం సేవించింది.

ఈ క్రమంలో కొందరు ఆమెను కలిశారు. కక్కనాడ్​లోని తన ఇంట్లో దింపుతామని ఆఫర్​ ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి.. అందుకు ఒప్పుకుంది.

19 year old raped in Kerala : యువతితో పాటు ముగ్గురు పురుషులు, ఒక మహిళ కారు ఎక్కారు. ఆర్ధరాత్రి నగరం మొత్తం తిప్పారు. ఈ క్రమంలోనే ఆమెపై ఆ ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు.

ఆ తర్వాత.. ఆ యువతిని తన ఇంటికి సమీపంలో విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు నిందితులు.

యువతిని ఆమె రూమ్​మేట్​.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం బాధితురాలు.. అక్కడ చికిత్స పొందుతోంది.

ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది.. యువతి విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. యువతికి గాయాలైనట్టు వైద్య పరీక్షల్లో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహిళతో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్​ చేసినట్టు స్పష్టం చేశారు.

పెరిగిపోతున్న నేరాలు..

Conductor rapes woman passenger : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచార ఘటనలు ఆందోళనకర రీతిలో ఉన్నాయి. ఓ ప్రయాణికురాలిపై ఓ బస్సు కండెక్టర్​ అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​లో కలకలం సృష్టించింది.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మాట్లాడుతూ.. ‘ఒక బస్సు కండక్టర్ మహిళను తప్పుదారి పట్టించాడు. బస్సు ఆమె దిగాల్సిన స్టాప్‌కు వెళ్తుందని ఆమెకు చెప్పాడు. కానీ బదులుగా ఆమెను మరొక ప్రదేశానికి తీసుకెళ్లాడు. కండక్టర్ చివరి స్టాప్‌లో మహిళపై రాత్రిపూట అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత వాహనం నుంచి తోసేశాడు..’ అని వివరించారు.

బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కండక్టర్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కండక్టర్‌పై ఐపీసీ 373, 367 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్​ చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు పంపినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం