4 terrorists killed: భారీగా ఆయుధాలతో భారత్ లోకి; మట్టుబెట్టిన ఆర్మీ-4 heavily armed terrorists travelling to kashmir killed in chance encounter in jammu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  4 Heavily-armed Terrorists Travelling To Kashmir Killed In 'Chance Encounter' In Jammu

4 terrorists killed: భారీగా ఆయుధాలతో భారత్ లోకి; మట్టుబెట్టిన ఆర్మీ

HT Telugu Desk HT Telugu
Dec 28, 2022 05:10 PM IST

Major encounter in Jammu: పాకిస్తాన్ నుంచి భారత్ లోకి విజయవంతంగా చొరబడి, జమ్మూ నుంచి ఒక ట్రక్ లో కశ్మీర్ కు వెళ్తున్న నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

ఎన్ కౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో భద్రత బలగాలు
ఎన్ కౌంటర్ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో భద్రత బలగాలు (PTI)

Major encounter in Jammu: భారీ ఉగ్రదాడిని భారత సైన్యం అనుకోకుండా, అడ్డుకుంది. భారీగా ఆయుధాలతో భారత్ లో విధ్వంసం సృష్టించడానికి పాక్ నుంచి వచ్చిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చింది.

ట్రెండింగ్ వార్తలు

Major encounter in Jammu: రిపబ్లిక్ డే ముందు..

భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కశ్మీర్లో ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో.. భారీగా ఆయుధాలతో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వడం శుభపరిణామమని భావిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ హైవే పై సిధ్ర బై పాస్ కు దగ్గరలో తావి బ్రిడ్జ్ వద్ద బుధవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రత బలగాలు జమ్మూ నుంచి కశ్మీర్ వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ట్రక్ ను వెంబడించి, తావి బ్రిడ్జ్ వద్ద ఆ ట్రక్ ను అడ్డుకున్నారు. ఈ లోపు వారిపై ట్రక్ లోపలి నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. దాంతో, అప్రమత్తమైన భద్రత బలగాలు, ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు గంట పాటు ఈ ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ లోపు ట్రక్ డ్రైవర్ తప్పించుకున్నాడు. ఎన్ కౌంటర్ ముగిసిన తరువాత ట్రక్ లోపల నాలుగు మృతదేహాలను భద్రత బలగాలు గుర్తించాయి.

4 terrorists killed: భారీగా ఆయుధాలు

మృతదేహాలతో పాటు ట్రక్ లోపల, ఏడు ఏకే రైఫిల్స్(AK assault rifles)ను, ఒక ఆధునిక ఎం 4 రైఫిల్(M4 rifle) ను, మూడు పిస్టల్స్(pistols) ను, పెద్ద ఎత్తున మందుగుండు ను స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక ఎం 4 రైఫిల్ ఉండడాన్ని గమనిస్తే, హతమైన ఉగ్రవాదుల్లో కమాండర్ స్థాయి టెర్రరిస్ట్ ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ఉగ్రవాదులు ఎవరు? ఏ సంస్థకు చెందినవారు?, ఏ మిషన్ పై కవ్మీర్ కు వెళ్తున్నారు? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నామని జమ్మూజోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు. జమ్మూ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇదన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లో పెద్ద ఎత్తున ఆయుధాలతో ఒక ట్రక్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్న అనంతరం, నిఘా పెంచామని వివరించారు. ఈ సీజన్ లో పాక నుంచి చొరబాట్లకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

IPL_Entry_Point