Delhi crime news: కన్నకొడుకుల గొంతు కోసిన తండ్రి; ఆ పై ఆత్మాహత్యాయత్నం
Father slits his sons throat: కన్న తండ్రే తన ఇద్దరు మైనర్ కుమారుల గొంతు కోసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ కుమారుల్లో రెండేళ్ల వాడు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Father slits his sons throat: ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ కుమారుల గొంతు కోసి హతమార్చాలని ఒక తండ్రి ప్రయత్నించాడు. ఆ తరువాత అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది.
మైనర్ కుమారులు
ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో ఉన్న భరత్ నగర్ సమీపంలో జేజే కాలనీ ఉంటుంది. అందులో ఇన్వర్టర్ మెకానిక్ గా పని చేసే 36 ఏళ్ల నిందితుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ గొడవలతో క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి చంపేయడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య ఇంట్లో లేదు. ఈ ఘటనలో రెండేళ్ల వయస్సున్న చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల వయస్సున్న పెద్ద కుమారుడు, ఈ దారుణానికి పాల్పడిన కన్నతండ్రి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసు కేసు..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి నిందితుడు ఎందుకు పాల్పడ్డాడనే విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. నిందితుడిపై హత్య, హత్యా ప్రయత్నం, ఆత్మహత్య ప్రయత్నం, తదితర నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు, అతడి ఐదేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.