Nobel Prize in physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం-3 physicists share nobel prize for work on quantum science ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  3 Physicists Share Nobel Prize For Work On Quantum Science

Nobel Prize in physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 03:54 PM IST

Nobel Prize in physics: భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది.

2022 Nobel Prize in Physics winners: (ఎడమ నుంచి కుడికి) అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఫ్రాన్సిస్ క్లాజర్, ఆంటన్ జెలింగర్
2022 Nobel Prize in Physics winners: (ఎడమ నుంచి కుడికి) అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఫ్రాన్సిస్ క్లాజర్, ఆంటన్ జెలింగర్ (AFP)

స్టాక్‌హోమ్: ఎన్‌క్రిప్షన్ సహా పలు ముఖ్యమైన అప్లికేషన్‌లను కలిగి ఉన్న క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన కృషికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రం విభాగంలో ఈ సంవత్సరం సంయుక్తంగా నోబెల్ పురస్కారం గెలుచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జైలింగర్‌లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం’గా పేర్కొంది.

‘క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్ ఒక శక్తిమంతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న క్షేత్రం’ అని నోబెల్ కమిటీ సభ్యుడు ఎవా ఓల్సన్ అన్నారు. ‘సురక్షిత సమాచార బదిలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్ టెక్నాలజీ వంటి రంగాలలో ఇది విస్తృత ప్రభావాలను కలిగి ఉంది..’ అని పేర్కొన్నారు.

‘దీని మూలాన్ని క్వాంటమ్ మెకానిక్స్‌లో గుర్తించవచ్చు’ అని చెప్పారు. ‘దీనిపై అంచనాలు మరొక ప్రపంచానికి తలుపులు తెరిచాయి. మెజర్‌మెంట్స్‌ను అర్థం చేసుకునే తీరును సమూలంగా మార్చింది..’ అని ఆమె చెప్పారు.

గత సంవత్సరం ఈ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు స్యుకురో మనాబే, క్లాస్ హాసెల్‌మాన్, జార్జియో పారిసిలకు అందించారు. వీరి పరిశోధన ఫలితాలు ప్రకృతి యొక్క సంక్లిష్ట శక్తులను వివరించడానికి, అంచనా వేయడానికి సహాయపడ్డాయి. తద్వారా వాతావరణ మార్పులపై మన అవగాహనను విస్తరించింది.

మన రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన అంతర్దృష్టులను అందించిన నియాండర్తల్ డీఎన్ఏ రహస్యాలను విశ్లేషించినందుకు గాను స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంట్ పాబో ను సోమవారం వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది.

బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి పురస్కారం ప్రకటిస్తారు. అర్థ శాస్త్రంలో పురస్కార విజేతను అక్టోబర్ 10న ప్రకటించనున్నారు.

WhatsApp channel