Telugu News  /  National International  /  3 Men Molest Woman In Up's Prayagraj Despite Fiance's Pleas
యువతిని లైంగికంగా వేధిస్తున్న యువకులు
యువతిని లైంగికంగా వేధిస్తున్న యువకులు

3 men molest woman despite fiance's pleas: కాబోయే భర్త ముందే వేధింపులు

23 September 2022, 20:50 ISTHT Telugu Desk
  • Share on Twitter
  • Share on FaceBook
23 September 2022, 20:50 IST

3 men molest woman despite fiance's pleas: కాబోయే భర్త ముందే ఒక యువతిని ముగ్గురు యువకులు దారుణంగా వేధించారు. ఆ కాబోయే భర్త వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వారు కనికరించలేదు.

3 men molest woman despite fiance's pleas: కాబోయే భర్తతో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు దారుణంగా వేధించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన రాజకీయంగా అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమైంది.

ట్రెండింగ్ వార్తలు

3 men molest woman despite fiance's pleas: అసభ్యంగా ప్రవర్తిస్తూ..

ఈ ఘటన యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. కాబోయే భార్యను కలిసేందుకు సొరావో నుంచి కాబోయే భర్త వచ్చాడు. వారిద్దరు కలిసి రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా, వారిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ కాబోయే భర్తను పక్కకు నెట్టివేసి, ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఆమెను పట్టుకుని, దూషిస్తూ, లైంగికంగా వేధించారు.

3 men molest woman despite fiance's pleas: కాళ్లు పట్టుకున్నా వదల్లేదు..

తామిద్దరం కాబోయే భార్యాభర్తలమని, తమను వదిలేయాలని వారిద్దరూ ఆ ముగ్గరు దుండగులను వేడుకున్నారు. తమను వదిలేయాలని ఆ కాబోయే భర్త ఆ దుండగుల కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. అయినా, వారు కనికరించలేదు. ఇద్దరు ఆ అమ్మాయిని వేధిస్తుండగా, మరొకరు ఇదంతా వీడియో తీశాడు.

3 men molest woman despite fiance's pleas: సంచలనం..

ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఆ యువతిని వారు వేధిస్తున్న వీడియో వైరల్ అయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన వాసిక్, జికారియా, మషూక్ ల కోసం గాలింపు ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు ముంబై పారిపోయారని గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని బీజేపీ పేర్కొంది. బీజేపీ పాలనలో యూపీలో మహిళలపై నేరలు పెరుగుతున్నాయని విపక్ష ఎస్పీ, కాంగ్రెస్ విమర్శించాయి.