Encounter: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి; కొనసాగుతున్న ఎన్ కౌంటర్-3 maoists killed in gunfight with security forces in chhattisgarhs bastar police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Encounter: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి; కొనసాగుతున్న ఎన్ కౌంటర్

Encounter: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి; కొనసాగుతున్న ఎన్ కౌంటర్

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 03:14 PM IST

Encounter: ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అనుమానిత మావోయిస్టులు మృతి చెందారు. మావోలు ఉన్నారన్న సమాచారంతో బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చేపట్టిన సమయంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Encounter: ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అనుమానిత మావోయిస్టులు హతమయ్యారు. గురువారం మధ్యాహ్నం సమయానికి కూడా ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

yearly horoscope entry point

ఛత్తీస్ గఢ్ లో..

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మఢ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సంయుక్త బృందం గాలింపు చర్యలు చేపట్టిందని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారని, దాంతో, పోలీసులు ఎదురుకాల్పులకు (ENCOUNTER) దిగారని ఎస్పీ వివరించారు. కాల్పులు ఆగిన తర్వాత ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు సాహిత్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.

34 మంది పౌరులు

ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటివరకు మావోయిస్టుల చేతిలో 34 మంది పౌరులు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఛత్తీస్ గఢ్ లో వామపక్ష తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 145 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.