Indian student stabbed: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి; పరిస్థితి విషమం-24yearold indian student stabbed in the us condition critical report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  24-year-old Indian Student Stabbed In The Us, Condition Critical: Report

Indian student stabbed: అమెరికాలో భారతీయ విద్యార్థిపై కత్తితో దాడి; పరిస్థితి విషమం

HT Telugu Desk HT Telugu
Nov 01, 2023 12:11 PM IST

Indian student stabbed: అమెరికాలోని ఇండియానాలో భారతీయ విద్యార్థి వరుణ్ పై ఆండ్రాడ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఆండ్రాడ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Indian student stabbed: అమెరికాలోని ఇండియానాలో ఉన్న వాల్పారైజో (Valparaiso) లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఒక పబ్లిక్ జిమ్ లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి వరుణ్ (Indian student Varun) పై జోర్డాన్ ఆండ్రాడ్ (Jordan Andrad) అనే వ్యక్తి కత్తితో దాడి చేసి, తలపై విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో, వరుణ్ కు తీవ్రంగా రక్తస్రావమై, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు

పరిస్థితి విషమం..

సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, వెంటనే వరుణ్ ను స్థానికంగా ఉన్న ఫోర్ట్ వేన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వరుణ్ పరిస్థితి విషమంగా ఉందని, బ్రతకడానికి 5% మాత్రమే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వరుణ్ వారు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భారత్ లోని ఏ రాష్ట్రం నుంచి వరుణ్ యూఎస్ కు వచ్చాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.

తలపై పొడిచి..

జోర్డాన్ ఆండ్రాడ్ ఈ దాడి ఎందుకు చేశాడన్న కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఆండ్రాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఈ విషయమై అతడిని ప్రశ్నిస్తున్నారు. మసాజ్ కోసం పబ్లిక్ జిమ్ లోని మసాజ్ రూమ్ లోకి వెళ్లానని, అక్కడ వరుణ్ తనకు ప్రమాదకరంగా కనిపించాడని, అందుకే అతడిని కత్తితో నుదురు భాగంలో పొడిచానని ఆండ్రాడ్ పోలీసులకు తెలిపాడు. ‘‘మసాజ్ రూమ్ లో అతడు నాకు కొంత అనుమానాస్పదంగా కనిపించాడు. నన్ను చంపేసేందుకే వచ్చాడేమో అనుకున్నాను. అందుకే కత్తితో దాడి చేశాను. తలపై కత్తితో పొడవడంతో కుర్చీపై కుప్పకూలిపోయాడు. అతడి నుంచి ఎలాంటి ప్రతిఘటన రాలేదు. ఆ తరువాత నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను’’ అని ఆండ్రాడ్ పోలీసులకు వివరించాడు. ఆండ్రాడ్ పై పోలీసులు హత్యాయత్నం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

WhatsApp channel