Mumbai Crime news: కాలేజీ విద్యార్థినిపై బీరు బాటిల్ తో బిక్షగాడి దాడి-21 year old woman attacked by a beggar in nerul ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  21 Year Old Woman Attacked By A Beggar In Nerul

Mumbai Crime news: కాలేజీ విద్యార్థినిపై బీరు బాటిల్ తో బిక్షగాడి దాడి

HT Telugu Desk HT Telugu
Dec 08, 2023 02:56 PM IST

Mumbai Crime news: బీరు బాటిల్ తో ఒక బిక్షగాడు దాడి చేయడంతో ఒక కాలేజీ విద్యార్థిని తీవ్ర గాయాల పాలైన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Mumbai Crime news: ముంబైలోని నెరుల్ ప్రాంతంలోని ఒక కాలేజీకి పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని పై బస్ స్టాప్ లో స్థానికంగా ఉండే ఒక బిక్షగాడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఎగ్జామ్ కోసం వచ్చి..

డిగ్రీ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫైనల్ ఈయర్ లో ఉన్న నిషా కుంభార్ అనే యువతి ఫిఫ్త్ సెమిస్టర్ పరీక్షలు రాయడం కోసం, ఎగ్జామ్ సెంటర్ నెరులి ప్రాంతంలోని సీ వుడ్స్ లో ఉన్న స్టెర్లింగ్ కాలేజీ వద్దకు తన స్నేహితురాలు కుషీ కదమ్ తో కలిసి వచ్చింది. వారిద్దరు హాల్ టికెట్ ను, ఎగ్జామ్ సెంటర్ ను చెక్ చేసుకోవడం కోసం బస్టాప్ లో కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఒక బిక్షగాడు వారిపై పగిలిపోయిన బీరు బాటిల్ తో దాడి చేశాడు. ఆ పగిలిపోయిన బాటిల్ తో ఆమెపై పలుమార్లు పొడిచాడు. ఈ దాడిలో నిషాకు చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. లిగ్మెంట్ తెగిపోయింది. ఫ్రాక్చర్ అయింది. ఇంతలో స్థానికులు పరిగెత్తుకు రావడం గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

పోలీస్ కేసు..

వెంటనే, స్థానికులు ఆమెను దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో, బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ చూసి, నిందితుడిని గుర్తించారు. కాసేపు గాలించిన తరువాత, అక్కడే ఫుట్ పాత్ పై ఉన్న నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేశారు. అతడిని డ్రగ్స్, గంజాయి ఎడిక్ట్ గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని 26 ఏళ్ల ఇమామ్ హసన్ షంషూద్ గా గుర్తించారు.

WhatsApp channel