Tweet on bombing Bengaluru airport: ‘‘ఇలాంటి పిచ్చి ట్వీట్స్ చేయకండి.. డేంజర్’’-20yearold engineering student held over tweet on bombing bengaluru airport ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  20-year-old Engineering Student Held Over Tweet On 'Bombing' Bengaluru Airport

Tweet on bombing Bengaluru airport: ‘‘ఇలాంటి పిచ్చి ట్వీట్స్ చేయకండి.. డేంజర్’’

HT Telugu Desk HT Telugu
Dec 23, 2022 04:20 PM IST

Tweet on bombing Bengaluru airport:బెంగళూరు విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన ఒక విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

Tweet on bombing Bengaluru airport: బెంగళూరులో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని ట్వీట్ చేశాడు. విమానాశ్రయ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సైబర్ పోలీసుల సహకారంతో ఆ విద్యార్థిని గురువారం అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Tweet on bombing Bengaluru airport: కొత్త ఏర్ పోర్ట్ కోసం..

బెంగళూరు దక్షిణ ప్రాంతంలోని కుద్లు గేట్ వద్ద నివసించే వైభవ్ గణేశ్ అనే 20 ఏళ్ల ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి డిసెంబర్ 10న ఈ ట్వీట్ చేశారు. ‘‘బెంగళూరు విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తాను. దాంతో, వారు సిటీకి దగ్గరలో మరో ఏర్ పోర్ట్ ను నిర్మిస్తారు’’ అని ఆ విద్యార్థి ట్వీట్ చేశాడు. కాసేపటికి ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ ట్వీట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

Tweet on bombing Bengaluru airport: ఫ్రస్ట్రేషన్ తో..

దాంతో, విమానాశ్రయ అధికారులు ఈ ట్వీట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 505, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో చివరకు గణేశ్ వైభవ్ ను గురువారం అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. తన ఇంటి నుంచి విమానాశ్రయం చాలా దూరంలో ఉందని, తరచూ అక్కడికి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండడంతో కోపంలో, ఫ్రస్ట్రేషన్ తో అలా ట్వీట్ చేశానని ఆ విద్యార్థి పోలీసులకు వివరించాడు. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ కూడా చేశనన్నాడు.

Tweet on bombing Bengaluru airport: పిచ్చి ట్వీట్ లు చేయకండి..

ఈ నేపథ్యంలో ఇలాంటి పిచ్చి ట్వీట్ లు, మెసేజ్ లు చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. అనవసరంగా, చిక్కుల్లో పడుతారని బెంగళూరు నార్తర్న్ డివిజన్ డీసీపీ అనూప్ శెట్టి హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలతో కూడిన ట్వీట్ల వల్ల భవిష్యత్ దెబ్బతింటుందని, అందువల్ల సోషల్ మీడియాలో మెసేజ్ లు పోస్ట్ చేసే విషయంలో, వేరే పోస్ట్ లను షేర్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బెంగళూరు ఏర్ పోర్ట్ నగర శివార్లలో, నగరం మధ్య నుంచి సుమారు 35 కిమీల దూరంలో ఉంటుంది. నగరంలో నుంచి అక్కడికి సరైన ట్రాన్స్ పోర్ట్ సదుపాయాలు కూడా లేవు. దాంతో, చాలామంది ప్రయాణీకులు సామాజిక మాధ్యమాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

IPL_Entry_Point