16-yr-old raped: మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
16-yr-old raped:16 ఏళ్ల మైనర్ బాలికపై ఒక మైనర్ సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్ లో జరిగింది.
16-yr-old raped: రాజస్తాన్ లోని లాద్నన్ పట్టణంలో 16 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఇంటిలో నుంచి బలవంతంగా లాక్కువెళ్లి, కారులో అత్యాచారం చేశారు. నిందితుల్లో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకువెళ్లి..
ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నిందితులు ఆ బాలిక ను బలవంతంగా తీసుకువెళ్లి, కారులో సామూహిక అత్యాచారం (gang rape) చేశారు. నిందితుల్లో ఉన్న 16 ఏళ్ల బాలుడు ఆ బాలికను తెలిసిన వాడుగా భావిస్తున్నారు. బాలిక తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత.. ఇంటి గేటు, ఇంటి డోర్ బార్లా తెరిచి ఉండడం, ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల గాలించడం ప్రారంభించాడు. ఇంతలో, ఆ సమీపంలోకి దూసుకువచ్చిన కారు, ఆ బాలికను కార్లో నుంచి బయటకు తోసివేసి, వేగంగా వెళ్లిపోయింది.
పోలీసు కేసు..
వెంటనే ఆ బాలిక తండ్రి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ 16 ఏళ్ల బాలుడిపై సంబంధిత జువెనైల్ చట్టం కింద, మిగతా ఇద్దరిపై ఐపీసీ, పొక్సొ తదితర చట్టాల కింద కేసు నమోదు చేశారు. మేజర్లైన ఇద్దరు నిందితులను జాసరామ్, మహావీర్ లుగా గుర్తించారు.
బంధువుల ఆందోళన..
ఈ గ్యాంగ్ రేప్ సమాచారం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. నిందితులను తమకు అప్పగించాలని, తామే శిక్ష విధిస్తామని డిమాండ్ చేశారు.