Crime news : 9ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడి వయస్సు 16ఏళ్లు- టీవీ సిరీస్​ల ప్రభావంతో!-16yearold boy kills 9 year old neighbour attempts to burn her body in gurugram ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 9ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడి వయస్సు 16ఏళ్లు- టీవీ సిరీస్​ల ప్రభావంతో!

Crime news : 9ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడి వయస్సు 16ఏళ్లు- టీవీ సిరీస్​ల ప్రభావంతో!

Sharath Chitturi HT Telugu
Jul 02, 2024 06:40 AM IST

Gurugram crime news : పొరుగింటికి వెళ్లి, దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు ఓ బాలుడు. కానీ 9ఏళ్ల బాలికకు దొరికిపోయాడు. ఆమెను చంపేసి, మృతదేహాన్ని తగలబెట్టాడు! ఈ ఘటన గురుగ్రామ్​లో జరిగింది.

దొంగతనం చేస్తూ దొరికిపోయి, బాలికను చంపేసిన బాలుడు..
దొంగతనం చేస్తూ దొరికిపోయి, బాలికను చంపేసిన బాలుడు..

గురుగ్రామ్​లో అత్యంత హీనమైన, దారుణ ఘటన జరిగింది. ఓ 16ఏళ్ల బాలుడు.. ఓ 9ఏళ్ల బాలుడిని చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు!

ఇదీ జరిగింది..

గురుగ్రామ్ ద్వారకా ఎక్స్​ప్రెస్​వేలోని సెక్టార్​ 107లోని ఒక అపార్ట్​మెంట్​ సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాలికకు, బాలుడికి ముందే పరిచయం ఉంది. వారి తల్లులకు కూడా పరిచయం ఉంది. ఆమె రెండేళ్ల సోదరుడితో ఆడుకునేందుకు బాలుడు తరచూ వాళ్ల ఇంటికి వెళతాడు. బాలికకు హోంవర్క్​లో సాయం చేస్తూ ఉంటాడు.

సోమవారం ఉదయం బాధితురాలి తల్లిని 16ఏళ్ల బాలుడు కలిశాడు. అతడిని ఆమె తన ఇంటికి తీసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత తన కుమారుడిని తీసుకొచ్చేందుకు ఆ మహిళ బయటకు వెళ్లింది. ఇంతలో ఆ బాలుడు గదిలోకి వెళ్లి బంగారు ఆభరణాలను వెతకడం మొదలుపెట్టాడు. చివరికి.. 9ఏళ్ల బాలికకు దొరికిపోయాడు. ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టింది. తన తల్లికి చెబుతానని హెచ్చరించింది.

ఈ క్రమంలోనే ఒక దుప్పట్టా తీసుకుని బాలిక మెడకు చుట్టు, ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు ఆ బాలుడు. అనంతరం నాప్తలీన్​ బాల్స్​ (కలరా ఉండలు) తీసుకుని ఆమె మృతదేహం మీద వేశాడు. మృతదేహం మీద బట్టలు, తరగడ పెట్టాడు. వాటికి నిప్పంటించాడు.

అదే సమయంలో బాలిక తల్లి ఇంట్లోకి వచ్చింది. బెడ్​రూమ్​లో మంటలు కనిపించేసరికి ఒక్కసారిగా షాక్​ అయ్యి, పరుగులు తీసింది. అది గమనించిన నిందితుడు.. బంగారు ఆభరణాలను బయటకు విసిరేశాడు. ఇంట్లో దొంగలు పడ్డారని, బాలికను చంపేసి పారిపోయారని చెప్పాడు. కానీ ఆ మహిళ నమ్మలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు.

"బాలుడు చాలా తెలివైన వాడు. చాలా క్రైమ్​ సిరీస్​లు చూసి ఉంటాడు. నాప్తలీన్​ బాల్స్​కి త్వరగా నిప్పంటుకుంటుందని అతనికి తెలుసు," అని పోలీసులు చెప్పారు.

బాలుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు అతడిని పోలీస్​ స్టేషన్​కి తీసుకెళ్లి విచారణ జరిపారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు.. కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

లైంగిక దాడి చేశావా? అని బాలుడిని అడగ్గా.. "నాకు చట్టాల గురించి తెలుసు. పరీక్షలు చేసుకోండి," అని బదులిచ్చాడట.

అసలు బాలుడు ఎందుకు దొంగతనానికి పాల్పడ్డాడు? అనేది తెలియరాలేదు. కానీ తాను రూ. 20వేలు అప్పుచేసినట్టు ఓసారి, చేయలేదని ఓసారి.. పోలీసుల దగ్గర మాటలు మారుస్తూ వచ్చాడు.

ఈ ఘటనపై కొత్త క్రిమినల్​ చట్టాల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై బీఎన్​ఎస్​ సెక్షన్​ 103(1), 238(ఏ), 305, 62 కింద కేసు వేశారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన అనంతరం గురుగ్రామ్​లో నమోదైన తొలి కేసు ఇదే.

మరోవైపు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడి చేసిన పని గురించి తెలిసిన వారు షాక్​ అవుతున్నారు. 9ఏళ్ల బాలికను చంపే ఆలోచన అసలు 16ఏళ్ల బాలుడికి ఎలా వచ్చింది? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం