Smartphone addiction : తన ఫోన్‌ని తండ్రి లాగేసుకున్నాడని.. 16ఏళ్ల బాలుడు ఆత్మహత్య!
Smartphone addiction : ముంబైలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్మార్ట్‌ఫోన్‌ని తండ్రి లాగేసుకోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు.
Smartphone addiction kills boy : మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన స్మార్ట్‌ఫోన్‌ని తండ్రి లాగేసుకున్నాడన్న కారణంతో.. మనస్తాపానికి గురైన ఓ 16ఏళ్ల బాలుడు.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు! ఫలితంగా.. టీనేజర్స్‌లో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఇదీ జరిగింది..
ముంబైలోని మాల్వాని ప్రాంతంలో గురువారం జరిగింది ఈ ఘటన. బాలుడి వయస్సు 16ఏళ్లు. అతడికి స్మార్ట్‌ఫోన్ అంటే పిచ్చి! అది లేకపోతే.. డిప్రెషన్‌కి గురయ్యేంతగా అడిక్ట్ అయ్యాడు ఆ మైనర్. కానీ అతను ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ వాడుతూనే ఉంటున్నాడని.. తల్లిదండ్రులు కోపడేవారు.
ఈ నెల 16న కూడా ఇదే జరిగింది. స్మార్ట్‌ఫోన్ పట్టుకుని కనిపించిన కుమారుడిని మందలించాడు తండ్రి. ఎంతకీ వినకపోవడంతో.. ఆ ఫోన్‌ని లాగేసుకున్నాడు. ఫలితంగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాతే.. ఆ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు.
Boy commits suicide due to smartphone addiction : తనను ఫోన్ నుంచి దూరం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని గతంలో చాలాసార్లు చెప్పాడు ఆ బాలుడు. కానీ ఆ మాటలను అతడి తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోలేదు. నిజంగా ఆ పని చేస్తాడనని అనుకోలేదు.
గురువారం రాత్రి.. కిచెన్‌లోకి వెళ్లిన ఆ బాలుడు.. దుపట్టాతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటికి కిచెన్‌కు వెళ్లిన తండ్రి.. కుమారుడిని ఆ పరిస్థితులో చూసి షాక్ అయ్యాడు. అతడి ప్రాణాలను కాపాడేందుకు విఫలయత్నం చేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. బాలుడు అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
Mumbai crime news : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలుడి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేపట్టినట్టు.. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు.
స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో జాగ్రత్త..!
Smartphone addiction : స్మార్ట్‌ఫోన్ కోసం ప్రాణాలు తీసుకుంటున్న టీనేజర్ల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇలాంటివి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు. అయితే.. కొన్ని టిప్స్ పాటించి, పిల్లల స్మార్ట్‌ఫోన్ అడిక్షిన్ను తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోన్ వినియోగం, స్క్రీన్ టైమ్ విషయంలో పిల్లలకు పెద్దలు మార్గనిర్దేశకాలు ఇవ్వాలి. భోజనం, ఆట, బెడ్టైమ్ను వివరించాలి.
పిల్లలను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకుండా.. బయటకు తీసుకెళ్లాలి. ఔట్‌డోర్ గేమ్స్‌లో యాక్టివ్‌గా ఉంచాలి.
స్క్రీన్ టైమ్ ఎక్కువైతే కలిగే నష్టాలను పిల్లలకు పెద్దలు వివరించాలి. పలు ఉదాహరణలతో వారికి నచ్చజెప్పాలి.
సంబంధిత కథనం