Delhi crime news : నానమ్మని సుత్తితో కొట్టి చంపిన 16ఏళ్ల బాలుడు-​ బెట్టింగ్​కి డబ్బులు ఇవ్వట్లేదని!-16 year old kills grandmother after she denies him money to place bets in delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Crime News : నానమ్మని సుత్తితో కొట్టి చంపిన 16ఏళ్ల బాలుడు-​ బెట్టింగ్​కి డబ్బులు ఇవ్వట్లేదని!

Delhi crime news : నానమ్మని సుత్తితో కొట్టి చంపిన 16ఏళ్ల బాలుడు-​ బెట్టింగ్​కి డబ్బులు ఇవ్వట్లేదని!

Sharath Chitturi HT Telugu
Aug 06, 2024 05:57 AM IST

Delhi crime news : సొంత నానమ్మని సుత్తితో కొట్టి చంపేశాడు ఓ 16ఏళ్ల బాలుడు.​ ఆన్​లైన్​ బెట్టింగ్​కి డబ్బులు ఇవ్వట్లేదన్న కారణంతో ఈ పని చేశాడు!

ఆన్​లైన్​ బెట్టింగ్​కి డబ్బులు ఇవ్వట్లేదని..
ఆన్​లైన్​ బెట్టింగ్​కి డబ్బులు ఇవ్వట్లేదని..

దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్​లైన్ బెట్టింగ్ కోసం ఎక్కువ డబ్బు ఇవ్వడానికి నిరాకరించినందుకు 16 ఏళ్ల బాలుడు తన 65 ఏళ్ల నానమ్మను సుత్తితో అత్యంత కిరాతకంగా చంపేశాడు.

ఇదీ జరిగింది..

దిల్లీలోని తుగ్లకాబాద్​లో శనివారం జరిగింది ఈ ఘటన. మైనర్ బాలుడిని కోర్టులో హాజరుపరిచి అబ్జర్వేషన్ హోమ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ కోసం డబ్బు సంపాదించడానికి బాలుడు తన కుటుంబ బంగారాన్ని దొంగిలించి విక్రయించాడని పోలీసులు తెలిపారు.

ఆన్​లైన్​లో గేమ్స్ ఆడుతూ బాలుడు రూ.లక్షలు పోగొట్టుకున్నట్లు విచారణలో తేలింది. శనివారం అతను తన నానమ్మను డబ్బు అడిగాడు, ఆమె నిరాకరించడంతో అతను ఆమెని సుత్తితో పలుమార్లు కొట్టాడు," అని డిప్యూటీ పోలీసు కమిషనర్ (ఆగ్నేయ) రాజేష్ దేవ్ చెప్పారు.

తుగ్లకాబాద్​లోని ఓ ఇంట్లో తనకు సంబంధించిన మహిళ గాయపడి పడి ఉందని శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ వ్యక్తి నుంచి తమ కంట్రోల్ రూమ్​కి ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్​లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గుర్తించారు. ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

బాధితురాలు తన భర్తతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్​లో నివసిస్తోంది. మూడో అంతస్తులో 47 ఏళ్ల కుమారుడు- ఆతని భార్య భార్య, 16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. మిగిలిన రెండు అంతస్తులను అద్దెకు ఇచ్చారు. ఇది చనిపోయిన మహిళ, ఆమె భర్తకు ఆదాయ వనరు.

బాధిత కుటుంబాన్ని పోలీసులు విచారించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వచ్చానని, పలుమార్లు బెల్ మోగించినా ఎవరూ తలుపు తీయలేదని ఆమె 17 ఏళ్ల మనవరాలు పోలీసులకు తెలిపింది. ఆమె గ్రౌండ్ ఫ్లోర్ ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మరకలున్న చొక్కాను తన సోదరుడు కడుగుతున్నాడని వివరించింది. సాయంత్రం షిఫ్ట్ కోసం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యానని, అయితే నానమ్మను కలిసేందుకు వచ్చానని, ఆమె గాజులు గీరడంతో తన చొక్కాపై రక్తపు మరకలు పడ్డాయని బాలుడు అబద్ధం చెప్పాడు. కానీ మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో బాలుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక మూడో అంతస్తుకు వెళ్లి రక్తం గురించి తల్లికి చెప్పిందని పోలీసులు వివరించారు. తల్లి కిందకు పరిగెత్తి చూడగా వృద్ధురాలు తన గదిలో శవమై పడి ఉంది.

ఘటనాస్థలం నుంచి 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా నిరుద్యోగిగా ఉన్నానని, గత ఆరు నెలలుగా తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం లేదని తల్లిదండ్రులతో సంబంధాలు దెబ్బతిన్నాయని నిందితుడి తండ్రి (47) హెచ్​టీకి తెలిపారు. తమను ఆర్థికంగా ఆదుకోవడానికి తన కుమారుడు ఆన్​లైన్​ బెట్టింగ్​ని ఒక మార్గంగా కనుగొన్నాడని, కానీ అతను వారి సేవింగ్స్​ని కోల్పోయాడని వివరించాడు.

"ఈ ఏడాది పదో తరగతి పరీక్షల అనంతరం బెట్టింగ్​ నిర్వహించి డబ్బులు సంపాదించేందుకు యాప్​ని ఉపయోగించడం ప్రారంభించాడు. మొదట్లో కొంత డబ్బు సంపాదించినా చివరికి ఓడిపోవడం మొదలుపెట్టాడు. నష్టాలు భరించేందుకు డబ్బులు ఇచ్చామని, బెట్టింగ్ ఆపాలని చెప్పినా అతడు వినలేదని, అతను మా బంగారాన్ని కూడా విక్రయించినట్లు మేము అనుమానిస్తున్నాము" అని తండ్రి చెప్పారు.

ఆన్​లైన్​ బెట్టింగ్​లో మైనర్ రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడని, ఇది తన, తన భార్య బ్యాంకు ఖాతాల్లో అత్యవసర పొదుపు మొత్తం అని తండ్రి చెప్పారు.

నిందితుడు తరచూ తన నానమ్మను డబ్బు అడిగేవాడని, ఆమె చివరి రెండుసార్లు డబ్బు ఇచ్చిందని, కానీ శనివారం నిరాకరించిందని తండ్రి చెప్పారు. తన తల్లిదండ్రులు తమను ఆర్థికంగా దూరం చేశారని, తమ దుస్థితికి వారే కారణమని బాలుడు ఆమెపై అప్పటికే మనస్తాపానికి గురయ్యాడని తండ్రి తెలిపారు.

సంబంధిత కథనం