Crime news : 14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఒకరు మైనర్!
Rewari rape case : హరియాణాలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పొలాల్లో అపస్మారక స్థితిలో ఆమె కనిపించింది. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు.
Rewari gang rape case : హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 14ఏళ్ల బాలికపై ముగ్గురు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇదీ జరిగింది..
హరియాణాలోని రేవారీ నగరంలో జూన్ 12 అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. బాలిక.. హఠాత్తుగా ఇంట్లో నుంచి అదృశ్యమైంది. కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి.. జైపూర్- దిల్లీ జాతీయ రహదారి పక్కన ఉన్న పోలాల్లో ఆమె కనిపించింది. ఆ సమయంలో ఆమె స్పృహలో లేదు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Haryana crime news : "బాలికపై రేప్ జరిగిందని వైద్య పరీక్షల్లో తేలింది," అని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేపట్టగా.. పోలీసులకు మరికొన్ని విషయాలు తెలిశాయి.
బాలికను ఓ మైనర్ బాలుడు.. ఆమె ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. పోలం వద్ద మరో ఇద్దరు వారిని కలిశారు. అక్కడే.. ఆ 14ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
దర్యాప్తులో భాగంగా.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ని రేవారీలోని జువనైల్ జస్టీస్ బోర్డ్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం అతడిని ఫరీదాబాద్ బోర్ట్స్టల్ జైల్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరిని.. స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీస్ కస్టడీలో ఉంచారు.
Haryana rape case : నిందితులపై పోక్స్ చట్టానికి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద కేసు వేశారు పోలీసుల.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి:- బెర్త్ పైనే మూత్ర విసర్జన చేసిన సైనికుడు; కింది బెర్త్ మహిళపై పడిన మూత్రం; పట్టించుకోని ఆర్పీఎఫ్
యువతిపై గ్యాంగ్ రేప్.. నిప్పంటించుకుని ఆత్మహత్య!
Rajasthan Crime news today : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి.. సామూహిక అత్యాచారానికి గురైంది. కొందరు ఆమెను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి రేప్ చేశారు. అనంతరం.. ఆ యువతి.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది!
రాజస్థాన్ కోటాలో గురువారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితురాలి వయస్సు 18ఏళ్లు. గురువారం రాత్రి.. కుటుంబం నిద్రిస్తుండగా.. కొందరు ఇంట్లోకి ప్రవేశించారు. యువతిని కిడ్నాప్ చేసి, సమీపంలోని షాప్‌లోకి తీసుకెళ్లారు. ఒకరు బయట కాపాలా కాస్తుండగా.. మిగిలిన నలుగురు.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Girl gang raped in Rajasthan : కొంతసేపటికి.. ఇంట్లో ఒకరు.. మంచి నీరు తాగడానికి నిద్రలేచారు. యువతి కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. బయటకు వెళ్లి చూడగా.. సమీప దుకాణం నుంచి అరుపులు వినిపించాయి. అతను అటువైపు పరుగులు తీశాడు. కానీ.. షాపు బయట కాపాలా కాస్తున్న వ్యక్తి.. అతడిని దారుణంగా కొట్టాడు. కానీ ఎలాగో అలా.. షాపు డోర్‌ని ఓపెన్ చెయ్యగలిగాడు. లోపలి నుంచి ఆ యువతి.. ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం