Cricket ball : జననాంగాలకు క్రికెట్ బాల్ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!
Pune news latest : మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జననాంగాలకు క్రికెట్ బాల్ తగిలి.. ఓ 11ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు!
Boy Dies After Cricket Ball Hits His Genitals : మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 11ఏళ్ల బాలుడి జననాంగాలకు క్రికెట్ బాల్ తాకింది. అతను ప్రాణాలు కోల్పోయాడు!
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర పుణెలో గత వారం జరిగింది ఈ ఘటన. బాలుడి పేరు శంభు కాలిదాస్ ఖండ్వే అలియాస్ శౌర్య. వేసవి సెలవుల నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి అతను తరచూ క్రికెట్ అడేవాడు. గత వారం కూడా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. శౌర్య బౌలింగ్ చేశాడు. బ్యాటర్.. పవర్ఫుల్గా హిట్ చేశాడు. ఆ క్రికెట్ బాల్.. శౌర్యవైపు దూసుకొచ్చింది. స్పందించే సమయం లేకపోవడంతో, ఆ బాల్.. శౌర్య జననాంగాలను బలంగా తాకింది. అతను నొప్పితో విలపించి, నేల మీద పడిపోయాడు. ఆ దృశ్యాలు చూసిన మిగిలిన స్నేహితులు.. షాక్కు గురయ్యారు. ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. శౌర్యవైపు పరుగులు తీశారు. శౌర్యను లేపేందుకు ప్రయత్నించారు. కానీ స్పృహ కోల్పోయిన శౌర్య.. స్పందించలేదు.
ఈ దృశ్యాలను.. అటుగా వెళుతున్న కొందరు చూశారు. వెంటనే.. అక్కడికి పరుగులు తీశారు. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ 11ఏళ్ల శౌర్యని వైద్యులు కాపాడలేకపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొంతసేపటికే.. శౌర్య మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.
Maharastra news latest : ఘటనపై సమాచారం అందుకున్న శౌర్య కుటుంబసభ్యులు.. ఆసుపత్రికి పరుగులు తీశారు. తమ బిడ్డ మరణించాడన్న వార్త విని.. కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు.
ఇదీ చూడండి:- Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్
మరోవైపు.. జననాంగాలకు క్రికెట్ బాల్ తాకి, బాలుడు మరణించాడన్న వార్త పోలీసులకు తెలిసింది. ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. చివరికి.. యాక్సిడెంటల్ డెత్త్ (ప్రమాదవశాత్తు మరణం) కింద.. కేసు నమోదు చేసుకున్నారు.
క్రికెట్ అనేది ఇండియాలో ఒక మతంతో సమానం. ప్రతి వీధిలో ఎవరో ఒకరు క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అలాంటిది.. జననాంగాలకు బాల్ తగిలి బాలుడు మరణించాడన్న వార్త చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా.. పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆట కన్నా ప్రాణాలు ముఖ్యం అని అర్థం చేసుకోవాలి.
Pune Boy death : ఇంటర్నేషనల్ మ్యాచ్లో చాలా వసతులుంటాయి. ప్లేయర్లు గార్డ్స్ పెట్టుకుని బ్యాటింగ్ చేస్తారు. కానీ వీధుల్లో ఆడుకునే వారికి ఇవేవీ ఉండవు. అందుకే.. క్రికెట్ ఆడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి!
సంబంధిత కథనం