Human sacrifice in UP : యూపీలో నరబలి కలకలం.. 10ఏళ్ల బాలుడి గొంతు కోసి..-10yearold boy killed as human sacrifice in up 3 held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Human Sacrifice In Up : యూపీలో నరబలి కలకలం.. 10ఏళ్ల బాలుడి గొంతు కోసి..

Human sacrifice in UP : యూపీలో నరబలి కలకలం.. 10ఏళ్ల బాలుడి గొంతు కోసి..

Sharath Chitturi HT Telugu

Human sacrifice in UP : ఉత్తర్​ ప్రదేశ్​లో ఓ 10ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. తాంత్రికుడి మాటలు విని బాలుడి బంధువే అతడిని చంపేశాడు.

యూపీలో నరబలి కలకలం.. 10ఏళ్ల బాలుడి గొంతు కోసి..

Human sacrifice in UP : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడిచిపోయినా.. మూఢనమ్మకాలు ఇంకా ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి.10ఏళ్ల బాలుడి నరబలి ఘటన తాజాగా ఉత్తర్​ ప్రదేశ్​లో కలకలం సృష్టించింది. బంధువే బాలుడి గొంతు కోసి చంపేశాడని తెలిసింది.

ఇదీ జరిగింది..

కృష్ణ వర్మ అనే వ్యక్తి.. పర్సా గ్రామంలో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతని కుమారుడి పేరు వివేక వర్మ. కృష్ణ వర్మకు అనూప్​ పేరుతో ఓ బంధువు ఉన్నాడు. అతడికి రెండున్నరేళ్లు. ఆ బాలుడి మానసికంగా అనారోగ్యం పాలయ్యాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదు.

UP crime news : ఈ క్రమంలోనే ఓ తాంత్రికుడిని సంప్రదించాడు అనూప్​. నరబలి చేస్తే అంతా బాగుటుందని ఆ తాంత్రికుడు చెప్పాడు. కొడుకుపై ప్రేమో లేక మూడ నమ్మకాలపై విశ్వాసమో..ఆ తాంత్రికుడిని గుడ్డిగా నమ్మేశాడు అనూప్​.

నరబలి కోసం వేటాడుతుండగా.. అనూప్​కు కృష్ణ వర్మ కుమారుడు గుర్తొచ్చాడు. అతడిని చంపేందుకు ప్లాన్​ వేశాడు. ఈ క్రమంలోనే అనూప్​, తన మామ చింతారామ్​​ సాయం కోరాడు. అతడు సాయం చేశాడు.

UP black magic case : గత గురువారం రాత్రి.. అనూప్​, చింతారామ్​లు వివేక్​ వర్మను అపహరించారు. పొలాల్లోకి తీసుకెళ్లి పదునైన కత్తితో గొంతు కోసి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నారు.

బిడ్డ కనపడటం లేదని కంగారు పడిన కృష్ణ వర్మ.. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. బిడ్డ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇంటికి సమీపంలోని పొలాల్లో వివేక్​ వర్మ మృతదేహం వారికి లంభించింది.

UP latest news : ఘటనపై మర్డర్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. తాంత్రికుడి మాటలు విన్న అనూప్​.. వివేక్​ వర్మను నరబలి ఇచ్చినట్టు తేలింది. చివరికి.. తాంత్రికుడు, అనూప్​తో పాటు హత్యకు సాయం చేసిన చింతారామ్​లను పోలీసులు అరెస్ట్​ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.