Kashmir news : కశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పై విరిగిపడిన కొండచరియలు-1 killed 6 trapped after landslide hits mega power project in jk s kishtwar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  1 Killed, 6 Trapped After Landslide Hits Mega Power Project In Jk`s Kishtwar

Kashmir news : కశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పై విరిగిపడిన కొండచరియలు

HT Telugu Desk HT Telugu
Oct 29, 2022 09:27 PM IST

Kashmir news : జమ్మూకశ్మీర్ లోని ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు కొండ చరియల కింద చిక్కుకుపోయారు.

ప్రమాద దృశ్యం
ప్రమాద దృశ్యం (Source: Twitter)

Kashmir news : జమ్మూకశ్మీర్ లోని కిశ్త్వర్ జిల్లాలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ రాట్లీ మెగా పవర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ప్రాజెక్ట్ పై శనివారం పక్కనున్న పర్వతంపై నుంచి కొండ చరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Kashmir news : జేసీబీ డ్రైవర్ మృతి

ఈ ప్రమాదంలో అక్కడి నిర్మాణ పనుల్లో ఉన్న జేసీబీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక కలెక్టర్ ను ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించానని వెల్లడించారు.

Kashmir news : సహాయ సిబ్బంది కూడా..

ఈ ప్రమాదం అనంతరం అక్కడి వారిని కాపాడేందుకు, సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు వచ్చిన ఆరుగురు రెస్క్యూ టీం సభ్యులు కూడా ఆ కొండ చరియల శిధిలాల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంపై జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.