London-Singapore flight : ఆకాశంలో ఉండగా విమానంలో భారీ కుదుపు.. ఒకరు మృతి- 30మందికి గాయాలు!
London Singapore flight turbulence : లండ్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానం.. భారీ కుదుపునకు గురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. 30మంది గాయపడ్డారు!

Singapore Airlines SQ321 flight : లండన్ నుంచి సింగపూర్‌కు వెళుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం.. మార్గం మధ్యలో భారీ కుదుపుకు గురైంది. ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి.
కుదుపులకు గురైన ఎస్క్యూ321 విమానం.. బ్యాంకాక్‌లో ల్యాండ్ అయ్యింది. కాగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ.. ఇలా కుదుపులకు ప్యాసింజర్ ప్రాణాలు కోల్పోవడం చాలా అరుదైన విషయం అని తెలుస్తోంది.
‘ఇప్పుడు మా ప్రాధాన్యత అదే..’
"లండన్‌లోని హీథ్రో విమానాశ్రయం నుంచి ఎస్క్యూ321 సోమవారం సింగపూర్‌కు బయలుదేరింది. కానీ మార్గం మధ్యలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. ఫలితంగా.. విమానాన్ని బ్యాంకాక్‌లోని సువర్నభూమి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించడం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు.. సంబంధిత విమానం బ్యాంకాక్‌లో ల్యాండ్ అయ్యింది," అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఘటన జరిగిన సమయంలో.. ఈ బోయింగ్ 777-300 ఈఆర్ మోడల్ విమానంలో మొత్తం 211 మంది ప్యాసింజర్లు, 18 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరు మరణించారు. 30మందికి గాయాలయ్యాయి.
Singapore Airlines turbulence : "బోయింగ్ విమానంలో ఒకరు మరణించారని ధ్రువీకరిస్తున్నాము. పలువురు గాయపడ్డారు. ప్యాసింజర్లు, సిబ్బందికి అన్ని విధాలుగా సాయం చేయడం మా ప్రాధాన్యత. థాయ్‌లాండ్ స్థానిక అధికారులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాము. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు కృషి చేస్తున్నాము. అదనపు మద్దతు కోసం మా టీమ్‌ని బ్యాంకాక్‌కి పంపిస్తున్నాము," అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
నిపుణులు ప్రకారం.. విమానాలు టర్బ్యులెన్స్కి గురవడం సాధారణమైన విషయం. ఒక్కోసారి దాని తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే.. సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల లేదా ముందుగానే పైలట్ సమాచారం ఇవ్వకపోవడం వల్ల విమానంలోని వారికి గాయాలవ్వొచ్చు. ఇందులో పైలట్‌ని అనడానికి ఏం లేదు. వెథర్ రాడార్‌లో అంతా సాధారణంగానే ఉన్నా.. ఒక్కోసారి విమానం హఠాత్తుగా కుదుపులకు గురవ్వొచ్చు. ఈ సందర్భాల్లో కాక్‌పిట్‌లో ప్యాసింజర్లు ఎగిరిపడుతుంటారు. గాయాలవుతాయి.
London to Singapore flight turbulence : 2023 మేలో.. దిల్లీ- సిడ్నీ ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత పైలట్లను విధుల నుంచి తప్పించారు.
సంబంధిత కథనం