Zika Virus Symptoms : జికా వైరస్ ప్రభావం గర్భంలోని శిశువుపై కూడా ఉంటుందట.. జాగ్రత్త..-zika virus symptoms and treatment and precautions here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zika Virus Symptoms : జికా వైరస్ ప్రభావం గర్భంలోని శిశువుపై కూడా ఉంటుందట.. జాగ్రత్త..

Zika Virus Symptoms : జికా వైరస్ ప్రభావం గర్భంలోని శిశువుపై కూడా ఉంటుందట.. జాగ్రత్త..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 16, 2022 09:17 PM IST

Zika Virus Symptoms : జికావైరస్ చాపకింద నీరులా దేశం మొత్తం వ్యాపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించింది ఈ వైరస్. అసలు ఈ వైరస్ వ్యాపించడానికి ముఖ్య కారణం ఏంటి. దీన్ని ప్రభావం ప్రాణాంతకమా? దీనికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జికా వైరస్ ప్రభావం
జికా వైరస్ ప్రభావం

Zika Virus Symptoms : ఇటీవలే దేశంలో కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్ కేసును ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ధృవీకరించారు. దానికన్నా ముందు గుజరాత్, పూణే వంటి ప్రదేశాల్లో కూడా ఈ వైరస్ వ్యాపించింది. పరీక్ష కోసం పూణేకు పంపిన మూడు నమూనాల్లో.. ఒకరికి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు జీకా వైరస్ పాజిటివ్ అని తేలింది. పూణెకు చెందిన 67 ఏళ్ల వ్యక్తికి గతంలో పాజిటివ్ అని తేలింది.

దోమలతో వ్యాప్తించే జికా వైరస్ 1947లో.. ఉగాండాలోని కోతుల ద్వారా వ్యాపించింది అని పరిశోధకులు వెలడించారు. పగటిపూట కుట్టే ఈడెస్ దోమ కారణంగా.. జికా వైరస్ వ్యాపిస్తుంది. ఇదే కాకుండా చికున్‌గున్యా, డెంగ్యూ, పచ్చకామర్లు వంటి జ్వరాలు ఈ దోమల ద్వారానే వ్యాప్తిచెందుతాయి. ప్రస్తుతం జికా వైరస్ కోసం ఎలాంటి చికిత్స లేదని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జే. హరి కిషన్ తెలిపారు.

లక్షణాలు ఏంటంటే..

జికా వైరస్ వ్యాపించిన బాధితులలో ఎక్కువమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. తేలికపాటి జ్వరం, దద్దుర్లు కండరాల నొప్పి వంటివి సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయి. కొన్ని సందర్భాలలో జికా వైరస్ సంక్రమణ సంకేతాలు లేని వ్యక్తులలో గిల్లెన్-బారే సిండ్రోమ్ వంటి నాడీ వ్యవస్థ లేదా మెదడులో సమస్యలకు దారితీస్తుంది. ఈ లక్షణాలు సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల పాటు ఉంటాయి. వ్యాధి వ్యాప్తి చెందిన 3–14 రోజుల తరువాత అనారోగ్యంతో బాధపడుతారు.

కారణాలు ఇవే..

జికా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఒక దోమ కుట్టినప్పుడు ఆ దోమకి కూడా వైరస్ వ్యాపిస్తుంది. అప్పుడే సోకిని వైరస్ దోమల ద్వారా మరో వ్యక్తి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు జికా వైరస్ ఒక తల్లి నుంచి పిండానికి కూడా వ్యాప్తి చెందవచ్చు. లైంగిక సంబంధం ఉన్నప్పుడు వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు అవయవం లేదా రక్తదానం చేయడం ద్వారా వ్యాపించవచ్చు.

గర్భంలోని శిశువుపై..

జికా వైరస్ వ్యాపిస్తే గర్భధారణ సమయంలో మైక్రోసెఫాలీ, అధిక కండరాల టోన్, అసాధారణ కళ్లు, నవజాత శిశువులో వినికిడి లోపం వంటి పుట్టుకతో వచ్చే వైకల్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్లినికల్ లక్షణాలన్నింటిని పుట్టుకతో వచ్చే జికా సిండ్రోమ్ అని పిలుస్తారు.

గర్భధారణ సమయంలో జికా వైరస్ వ్యాప్తిచెందిన విషయం తరువాత పుట్టుకతో వచ్చే వైకల్యాల ప్రమాదం చాలామందికి తెలియకపోవచ్చు. జికా వైరస్ సోకిన గర్భిణీ స్త్రీలకు జన్మించిన శిశువులలో వారికి తెలియకుండానే 5-15% మందికి జికా-సంబంధిత సమస్యలు తలేత్తిన్నట్టు ఆధారాలు ఉన్నాయి (లక్షణాలు కనిపించకుండానే పుట్టుకతో వచ్చే లోపాలు సంక్రమణ తర్వాత అభివృద్ధి చెందుతాయి). అకాల పుట్టుక, పిండం నష్టం వంటివి గర్భధారణ సమయంలో జికా వ్యాప్తి వల్ల తలెత్తే కొన్ని సమస్యలు. గిల్లెన్-బారే సిండ్రోమ్, న్యూరోపతి, మైలిటిస్ ద్వారా కూడా జికా వైరస్ వ్యాపించవచ్చని తెలిపారు డాక్టర్ హరి కిషన్. దాని నివారణ కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి అంటున్నారు.

నివారణ

జికా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపడానికి.. దోమ కాటును నివారించడం అవసరం. అదనంగా జికా వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తి, ఇతర దేశాల నుంచి వచ్చే వారు కొన్ని రోజులు క్వారెంటైన్ చేయాలని సూచించారు.

ఇంటి పరిసరాల్లో నిలువ ఉన్న నీరు కూడా చూసుకోవాలని.. దోమలు నిలువ ఉన్న నీటిసమీపంలో గుడ్లు పెట్టడం ద్వారా పునరుత్పత్తి చేస్తాయని తెలిపారు. నీటిని కలిగి ఉన్నవి వాటిని వెంటనే ఖాళీ చేయాలని.. (పూల కుండలు, బొమ్మలు, కుండీలపై, సాసర్లు వంటివి) సూచిస్తున్నారు. టైర్ స్వింగ్స్ దిగువ భాగంలో పాత టైర్లను తీసివేసి రంధ్రాలను శుభ్రం చేయడం వంటివి చేయాలి.

అలాగే, లైంగిక కార్యకలాపాలు ద్వారా జికా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశముంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసురక్షిత సెక్స్ నివారించాలి. సురక్షితమైన శృంగారంలో పాల్గొనడానికి (కండోమ్‌ల వాడాలి) ప్రయత్నించండి.

చికిత్స

జికా వైరస్ కోసం నిర్దిష్ట చికిత్స ఇప్పటికీ కనుగొనలేదు. అదనంగా రోగులు నీరు ఎక్కువ తాగాలని.. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. మహిళలకు అదనపు క్లినికల్ కేర్ అవసరం అంటున్నారు.

సంబంధిత కథనం