శృంగారంలో లేటెస్ట్ ట్రెండ్ ఎంత వరకు కరెక్ట్? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?-youth intimacy behavior changing due to social media ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగారంలో లేటెస్ట్ ట్రెండ్ ఎంత వరకు కరెక్ట్? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?

శృంగారంలో లేటెస్ట్ ట్రెండ్ ఎంత వరకు కరెక్ట్? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?

Ramya Sri Marka HT Telugu

శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్న వారు సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో చూసి కాస్త దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాళ్లతో కొట్టుకోవడం, చైన్ తో కట్టేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా చేసేది ఎంజాయ్మెంటేనా.. ఇలా చేయడం ఎంతవరకూ కరెక్టో తెలుసుకుందాం. అది కూడా ట్రామా సర్జన్ మాటల్లో..

యువతలో మారుతున్న అలవాట్లు

యువత పోకడలో కాలాన్ని బట్టి తీరు మారుతుంటుంది. అదేవిధంగా శృంగారం పట్ల కూడా జరుగుతుంది. ఒకప్పుడు ఈ విషయం గురించి చర్చించడానికి ఆలోచించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని యథేచ్ఛగా ప్రసారమవుతున్న కంటెంట్‌తో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తమ పార్టనర్‌తో బాగా రఫ్‌గా లేదా ర్యూడ్‌గా ప్రవర్తిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరినొకరు హింసించుకుంటూ శృంగారం చేస్తుండటం ఒక ట్రెండ్‌గా మారిపోయింది.

హింసాత్మక శృంగారం

ఇది వారికి పరస్పరం ఇష్టపూర్వకంగా చేసుకునే చర్యనే కానీ, మరోరకంగా చూస్తే దీనిని క్రైమ్ గా పరిగణించాలట. పోర్న్ సైట్లలో కనిపించే కంటెంట్ చూసి ప్రేరణ పొందేవాళ్లలోనే ఈ ప్రవర్తన కనిపిస్తుందట. అవి చూసేవాళ్లు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నామా అని ఆలోచించరు. వాటిని మార్కెట్లలోకి రిలీజ్ చేసేవారు వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేంటో తెలియజేయరు. కానీ, పార్టనర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం, సెక్సువల్ గా హింసించడం వంటివి చూస్తూ వాటి వల్ల కలిగే ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. స్క్రీన్‌లో కనిపించే ప్రతిదానిని చేయాలనే కుతూహలంతో కొందరు టీనేజర్లే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారట.

పైగా స్క్రీన్లపై కనిపించేవారు టీనేజ్ వారేనంటూ చిత్రీకరించడంతో పరోక్షంగా ఇది నేరాలకు కూడా కారణంగా మారుతున్నాయట. ఐదుగురు టీనేజర్స్‌లో ఒకరు ఈ తరహా కంటెంట్ ప్రభావానికి లోనవుతున్నారని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం తెలిపింది

పెద్దవారు చూడటం వల్లనే

ఇదే విధంగా ప్రవర్తిస్తే క్రమేణా వాటి ఫలితాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయట. ఇది టీనేజర్లతో పాటు పెద్దవారిలోనూ కొందరు ఫాలో అవుతున్న అలవాటేనట. అదే ఫ్యామిలీలో ఉన్న చిన్నవాళ్లు మొబైల్ గ్యాడ్జెట్స్‌కు అలవాటుపడి, పెద్ద వాళ్ల మొబైల్స్ చూడటం, ర్యాన్‌డమ్‌గా అవే వీడియోలు వస్తుండటం కూడా దీనికి ప్రేరణగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా చూసేవారు ఆ చర్యల వల్ల కలిగే ఫలితాలను తెలుసుకోలేకపోవడం విచారకరమని అభిప్రాయపడుతున్నారు.

లిమిట్స్ మర్చిపోయి క్రూరంగా ప్రవర్తించడం వల్ల ఒక్కోసారి ప్రాణహాని జరిగే అవకాశం కూడా ఉందట. ఈ చర్యలు ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ముందుగానే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలట. ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఎంతవరకూ అలా వ్యవహరించొచ్చనే విషయం తెలిశాకే ఆ చర్యలకు పాల్పడమని సైంటిస్టులు సూచిస్తున్నారు. అది ఆడవారైనా, మగవారైనా ఇద్దరిలోనూ ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ఈ విధానాన్ని క్రమంగా మార్చుకోవాలని లేదంటే హింసాత్మకమైన ఆలోచనలు పెరిగిపోతాయట. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, మారుతున్న పోకడల మధ్య కుటుంబం, విద్యా సంస్థలు, సమాజం మీదే యువతకు సరైన దిశనిచ్చే బాధ్యత ఉంటుంది.

దీని కోసం ఏం చేయాలి

హింసాత్మకమైన సంబంధాలను అనుకరించడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం తగ్గడం, భయభ్రాంతులకు లోనవడం, నిద్రలేమి, ఆత్మహత్యల ఆలోచనలు వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువగా ఉన్న వయస్సులో ఇటువంటి అనుభవాలు వారికి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని మార్చేందుకు పాఠశాల స్థాయిలోనే సంబంధాలపై అవగాహన కల్పించే ప్రత్యేక శిక్షణలు అవసరం. డిజిటల్ లిటరసీ, హెల్దీ రిలేషన్‌షిప్స్, ఎమోషనల్ వెల్‌బీయింగ్ వంటి అంశాలపై వర్క్‌షాపులు, సెషన్స్ తీసుకోవాలి. యువత ఈ విషయాల్లో స్పష్టతతో ఉండాలంటే మానసిక ఆరోగ్య నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం