మీ సంతకం కింద ఒక గీత లేదా చుక్క పెట్టే అలవాటు ఉందా? మీ సంతకాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయవచ్చు
సంతకం ఒక్కొక్కరు ఒక్కోలా పెడతారు. అయితే సంతకాన్ని పెట్టే పద్ధతిని బట్టి వారు ఎలాంటివారో, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

చేతిరాత ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి చిహ్నంగా భావించవచ్చు. కొంతమంది పొడవుగా సంతకం పెడతారు. మరికొందరు వాలుగా రాస్తారు. మరి కొందరు సంతకం కింద చుక్కలు పెడతారు. ఇంకొందరు గీతలు పెడతారు. ఇలా రకరకాలుగా సంతకాలు పెట్టే అలవాట్లు ఉన్నాయి. అయితే సంతకాన్ని పెట్టి ఒక వ్యక్తి గురించి అంచనా వేయచ్చో లేదో తెలుసుకునేందుకు అధ్యయనాలు జరిగాయి. అయితే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం సంతకాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని తెలిసింది.
ఒక వ్యక్తి చేతిరాతను ఏడు విధాలుగా విశ్లేషించడం ద్వారా అతని స్వభావాన్ని అంచనా వేయచ్చని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి మీ సంతకం బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోండి.
పేరంతా సంతకంగా పెడితే
కొందరు సంతకం చేసేటప్పుడు పెద్దగా పేరంతా రాస్తారు. ఇలా పెద్ద సంతకాలు చేసే వ్యక్తులు స్నేహశీలిగా, ఉల్లాసమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మరికొందరు తమ పేరును పూర్తిగా రాయకుండా చిన్నగా సంతకం చేస్తారు. ఈ వ్యక్తులు భావోద్వేగపరంగా బయటపడరు. ఖర్చులు కూడా తక్కువ చేస్తారు. చాలా నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరిలో పిసినారితనం కూడా ఉంటుంది. అలాగే ఇలా చిన్న సంతకం చేసే వారికి గర్వం, అహంకారం వంటివి ఉండవు.
మొదటి అక్షరం పెద్దగా రాస్తే
అందరూ సంతకం చేసేటప్పుడు మొదటి అక్షరాన్ని పెద్దదిగా రాస్తారు. ఆ తర్వాత అక్షరాలన్నీ చిన్నగా ఉంటాయి .ఇలాంటి వ్యక్తులను స్వభావాన్ని సులభంగా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. సంతకంలోని చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాలు ఒక వ్యక్తి తనను తాను ఎలా అంచనా వేసుకుంటాడో, ఇతరులను ఎలా చూస్తాడో వెల్లడిస్తాయి. సంతకంలోని మొదటి అక్షరం పెద్దగా ఉంటే ఆ వ్యక్తికి అధిక ఆత్మగౌరవం ఉంటుంది. అదే సంతకంలో మొదటి అక్షరం చిన్నగా ఉంటే అతడు చాలా నిరాడంబరంగా ఉండే వ్యక్తి అని అర్థం.
కొంతమంది సంతకాలను వాలుగా అక్షరాలు పడిపోతున్నట్టుగా ఉంటాయి. అంటే అక్షరాలన్నీ ఒక వైపుకు వాలినట్టు ఉంటాయి. అలా సంతకాలు చేసే వ్యక్తులకు కోరికలు అధికంగా ఉంటాయి. వారి ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి. వారు సమతుల్య జీవన విధానాన్ని ఎంచుకుంటారు.
ఇంటి పేరును ముందు రాస్తే
అందరూ సంతకం చేసేటప్పుడు తమ ఇంటి పేరును మొదట రాసి సంతకం చేస్తారు. నిజానికి సంతకంలో ఇంటిపేరు అవసరం ఉండదు. కొంతమంది ఆ ఇంటి పేరుతోనే సంతకాన్ని కూడా చేసేందుకు ఇష్టపడతారు. అలాంటివారు స్వార్ధపరులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు సొంత కుటుంబంతో కూడా ఇష్టంగా ఉండరు. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా కఠినంగా ఉంటారు. వీరు తమకు తామే జీవించాలనుకుంటారు. స్వయం ఉపాధిని పొందాలని భావిస్తారు.
ఇంటి పేరు మాత్రమే
సంతకంలో ఇంటి పేరును మాత్రమే వాడే వారు కూడా ఉన్నారు. అలాంటివారు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సంతకంలో తమ పేరు లేకుండా ఇంటి పేరే పెట్టారంటే వారికి కుటుంబం పట్ల గొప్ప ప్రేమ, శ్రద్ధా ఉందని అర్థం. ఈ వ్యక్తులు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని సొంత కుటుంబ సభ్యుల సహకారంతో అధిగమిస్తారు.
అండర్ లైన్ గీస్తే
కొంతమంది సంతకం చేసాక చివర అండర్ లైన్ చేస్తారు. ఇలా సంతకం పెట్టే వ్యక్తులు నిరాడంబరంగా ఉంటారు. అయితే స్వార్థం మాత్రం వీరిలో ఎక్కువగా ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు. ఇతరులను ఆకట్టుకునే విధంగా ప్రవర్తించడం వీరికి రాదు.
సంతకం కింద ఒక గీతను మాత్రమే గీసేవారు ఇతరులు తమ గురించి మాట్లాడాలని కోరుకుంటారు. అలాగే సంతకం కింద రెండు గీతలు గీసేవారు తాము ఏమి చేస్తున్నామో ఇతరులు తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇతరులకు తాము ఏదైనా సాయం చేసి ఉంటే దాని గురించి చుట్టూ ఉన్నవారు మాట్లాడుకోవాలని వారు, ప్రశంసించాలని కోరుతూ ఉంటారు.
రెండు చుక్కలు పెడితే
సంతకం పూర్తయ్యాక చివరిలో రెండు చుక్కలు పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటివారు తాము చేసే ప్రతి పనిలోనూ పరిపూర్ణతను కోరుకుంటారు. సగం పని చేసి వదిలేయడానికి ఇష్టపడరు. ఏదైనా సక్రమంగా చేయాలని అనుకుంటారు.
సంబంధిత కథనం