మీ హెయిర్ స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుందట? ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!-your hair parting reveals secrets about your personality discover what your hairstyle says about you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ హెయిర్ స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుందట? ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

మీ హెయిర్ స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుందట? ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

మీరు మీ జుట్టును సైడ్ పార్టీషన్‌లో ఉంచడానికి ఇష్టపడతారా లేదా సెంటర్ పార్టీషన్‌లో ఉంచడానికి ఇష్టపడతారా? మీ వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు బయటపెట్టగలదు. వివిధ హెయిర్ స్టైల్స్ అర్థం ఏమిటో తెలుసుకుందాం.

వేరే వురే హెయిర్ స్టైల్స్ కలిగిన యువతి (refinery29)

ఎదుటివారి కళ్లల్లోకి చూసి వాళ్ల మనసులోని భావాలను అంచనా వేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కళ్లు నిజంగానే హృదయానికి అద్దం లాంటివి. ఇవి మనసులో భావాలను ఇట్టే బయటపెట్టేస్తాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ జుట్టును దువ్వుకునే విధానం కూడా మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో రహస్యాలను బయటపెడుతుందట.

అవును.. మీరు మీ జుట్టును ఎలా దువ్వుకుంటారు? పాపెడ కుడివైపుకు తీస్తారా లేక ఎడమవైపుకు దువ్వుతారా? మధ్యలో తీపి వెంట్రుకలను రెండు భాగాలుగా విభజిస్తారా? ఒక్కో రకమైన హెయిర్ స్టైల్ ఒక్కో రకమైన స్వభావం, ఆలోచనా విధానం, మీరు ప్రపంచాన్ని చూసే తీరును తెలియజేస్తాయట. ఎలాంటి హెయిర్ స్టైల్ ఏయే లక్షణాలను ప్రతిబింబిస్తుందో చూద్దాం రండి.

సైడ్ పార్టీషన్

జుట్టును ఒకవైపుకు దువ్వుకునేవారు అంటే సైడ్ పార్టీషన్ ఇష్టపడే వ్యక్తులు సాధారణంగా బలమైన ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వారిలో ఒక ప్రత్యేకమైన సృజనాత్మక ఆలోచన ఉంటుంది. వారు చాలా స్నేహపూర్వకంగా అందరితో కలిసిపోతారు ,జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ వెనుకాడరు. రిస్క్ తీసుకోవడం వారికి ఒక సాహసం లాంటిది. వారు చాలామందితో సామాజికంగా మెలగుతూ, కొత్త పరిచయాలు చేసుకోవడానికి ఇష్టపడతారు.

ఈ హెయిర్ స్టైల్ ముఖానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది. ఇది వారి వ్యక్తిత్వానికి మరింత ధైర్యాన్ని జోడిస్తుంది. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు, తమ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కళాకారులు, డిజైనర్లు లేదా వ్యాపారంలో విజయం సాధించిన నాయకులు ఈ సైడ్ పార్టీషన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వారి దృఢ సంకల్పాన్ని, నాయకత్వ లక్షణాలను, ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది.

సెంటర్ పార్టీషన్

పాపెడను మధ్యలోకి తీసి దువ్వుకునేవారు అంటే సెంటర్ పార్టీషన్ ఇష్టపడే వ్యక్తులు జీవితంలో అన్ని విషయాల్లోనూ ఒక సమతుల్యతను కోరుకుంటారు. వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయాన్ని అయినా చాలా జాగ్రత్తగా, తార్కికంగా ఆలోచించగల సామర్థ్యం వీరి సొంతం. వీరిలో క్రమశిక్షణ ఎక్కువ. తమ పనులను తాము పద్ధతిగా చేస్తారు ,నమ్మదగిన వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు.

ఈ హెయిర్ స్టైల్ సాధారణంగా ఉపాధ్యాయులు, రచయితలు లేదా లోతైన ఆలోచనలు కలిగిన, గంభీరమైన స్వభావం ఉన్నవారికి బాగా సరిపోతుంది. ఇది వారిలోని స్థిరత్వాన్ని, నిబద్ధతను ,విషయాలను స్పష్టంగా విశ్లేషించగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వారు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.

జిగ్‌జాగ్ పార్టీషన్

జుట్టును మెలికలు తిరిగినట్టు (జిగ్‌జాగ్) పాయతో దువ్వుకునే వ్యక్తులు సాధారణంగా చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటారు. వీరిలో ఎల్లప్పుడూ ఒక విధమైన శక్తి నిండి ఉంటుంది. వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ ఊహించలేరు. కొత్త విషయాలను ప్రయత్నించడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. జీవితాన్ని ప్రతి క్షణం ఉత్సాహంగా గడపడానికి ఇష్టపడతారు.

ఈ హెయిర్ స్టైల్ వీరిలోని చైతన్యాన్ని, స్వేచ్ఛా స్వభావాన్ని ,సంప్రదాయాలకు భిన్నంగా ఆలోచించే ప్రత్యేకమైన దృక్పథాన్ని తెలియజేస్తుంది. వీరు చాలా త్వరగా ఇతరులతో కలిసిపోతారు ,తమ చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని కలిగిస్తారు.

సహజమైన బీచ్ వేవ్స్

2017లో జర్నల్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం మహిళా కళాశాల విద్యార్థుల వివిధ హెయిర్ స్టైల్స్‌కు , వారి ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించింది. ఈ అధ్యయనంలో సహజంగా అలల్లా (Wavy) జుట్టు ఉన్న అమ్మాయిలు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనుగొన్నారు. ఇలాంటి వ్యక్తులలో శక్తి ,సృజనాత్మకతతో పాటు ఏదైనా సాధించాలనే బలమైన కోరిక కూడా ఉంటుంది. వీరి సహజమైన లుక్ వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగిస్తుంది. వీరు తమను తాము ఉన్నదున్నట్లుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది.

సూచనలు

  • మీ ముఖ ఆకారంతో పాటు, మీ వ్యక్తిత్వానికి బాగా సరిపోయే హెయిర్ స్టైల్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒక హెయిర్ స్టైల్ ఒక వ్యక్తికి అద్భుతంగా కనిపించవచ్చు, కానీ మరొకరికి అంతగా నప్పకపోవచ్చు. కాబట్టి మీ ప్రత్యేక లక్షణాలను హైలైట్ చేసే స్టైల్‌ను ఎంచుకోండి.
  • ఒకే హెయిర్ స్టైల్‌కు పరిమితం కాకుండా క్రమం తప్పకుండా మీ హెయిర్ స్టైల్‌ను మారుస్తూ ఉండండి. కొత్త లుక్స్‌ను ప్రయత్నించడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీ వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను మీరు అన్వేషించవచ్చు. ఇది మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.