Shloka Ambani: అంబానీ కోడలు వేసుకున్న ఈ టాప్ జీన్స్ డ్రెస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు-you will be surprised to know the price of this top jeans dress worn by ambanis daughter in law ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shloka Ambani: అంబానీ కోడలు వేసుకున్న ఈ టాప్ జీన్స్ డ్రెస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Shloka Ambani: అంబానీ కోడలు వేసుకున్న ఈ టాప్ జీన్స్ డ్రెస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Haritha Chappa HT Telugu
Published Feb 17, 2025 11:00 AM IST

Shloka Ambani: ముఖేష్ అంబానీ పెద్ద కోడరు శ్లోకా అంబానీ తన పిల్లలతో మీడియాకు కనిపించింది. ఆమె వేసుకున్న తెల్లని టాప్, ట్రెండీ డెనిమ్ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆ డ్రెస్ ధర ఎంతో తెలుసుకోండి.

శ్లోకా అంబానీ డ్రెస్
శ్లోకా అంబానీ డ్రెస్ (Instagram)

ముఖేష్ అంబానీ పెద్ద కోడు శ్లోక మెహతా అంబానీ. ఆమె చాలా సింపుల్ గా అందంగా ఉంటుంది. ఇటీవల ఆమె రణ్‌ధీర్ కపూర్ 78వ పుట్టినరోజు వేడుకలలో తన పిల్లలతో కనిపించింది. అంబానీ కోడళ్లు ఏ డ్రెస్ వేసుకున్నా అది ఎంతో చక్కగా ఉంటుంది. ఆ డ్రెస్ గురించి ఎంతో చర్చ జరుగుతుంది. వారు సౌకర్యవంతంగా, ట్రెండీగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకుంటారు. శ్లోకా మెహతా క్లాసిక్ టాప్, డెనిమ్ కాంబోలో స్టైలిష్ గా కనిపించింది. ఆమె లుక్‌ను విశ్లేషించి, కొన్ని ఫ్యాషన్ చిట్కాలను తెలుసుకుందాం. అలాగే ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు కూడా ఇచ్చాము. మీకు కావాలంటే కొనుక్కునే అవకాశం ఉంది.

శ్లోకా మెహతా వేసుకున్న టాప్ కాటన్ ఫాబ్రిక్‌తో తయారు చేశారు. దానికి జోడీగా సాధారణ డెనిమ్ జీన్స్ ను వేసుకుంది. ఇక టాప్ విషయానికి వస్తే… ఇది గుండ్రని నెక్‌లైన్, ఫ్లటర్ స్లీవ్స్, ఫ్రంట్ బటన్ ప్లాకెట్, ముందు భాగంలో పిన్-టకింగ్ కలిగి ఉంది. దీని నెక్‌లైన్, స్లీవ్స్, ఎంబ్రాయిడరీ కట్-అవుట్‌లు, ప్లీటెడ్ బాడీ టైయర్డ్ సిల్హౌట్ వల్ల ఈ టాప్ ఎంతో ఆకర్షణీయగా కనిపిస్తోంది. ఆమె దీనికి స్టైలిష్ గా బ్లూ డెనిమ్ జీన్స్‌తో జత చేసింది. అది వదులుగా ఉండే జీన్స్. ఆ జీన్స్ పై తెల్లని క్రోచెట్ పక్షి డిజైన్లు ఉన్నాయి.

వాటి ఖరీదు ఎంత?

శ్లోక డ్రెస్సింగ్ మీకు నచ్చిందా? వాటి ఖరీదు తెలసుకోవాలన్న కోరిక కలిగిందా? దీన్ని మీ వార్డ్ రోబ్‌కు జోడించాలనుకుంటే దీని ధర తెలసుకోండి. ఆమె వేసుకున్న తెల్లని టాప్ ‘సీ న్యూ యార్క్’ సంస్థ నుండి ఖరీదు చేసింది. దీని ధర $260గా ఉంది. అంటే మన రూపాయల్లో రూ.22000. ఆమె వేసుకున్న స్టైలిష్ డెనిమ్ పేటన్ జీన్స్ ధర $450. అంటే మన రూపాయల్లో రూ.39000.

శ్లోక తన లుక్‌ను తెల్లని హూప్ చెవిపోగులు, చేతికి గాజులు, మినీ కెల్లీ బ్యాగ్, ఫ్లాట్ చెప్పులతో అలంకరించింది. మినిమమ్ మేకప్ లుక్ ఎంపిక చేసింది. ఆమె మెరుస్తున్న తన జుట్టు లూజ్ గా వదిలేసింది.

శ్లోక మెహతా గురించి

వ్యాపారవేత్త రస్సెల్ మెహతా, మోనా మెహతా కుమార్తె… శ్లోక మెహతా. ఆమె ముకేష్, నీతా అంబానీ కుమారుడు అయిన ఆకాశ్ అంబానీని వివాహం చేసుకున్నారు. ఈ జంట 2019 మార్చి 9న వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 డిసెంబర్‌లో బాబు ప్రిథ్వీ అంబానీ జన్మించగా, 2023 మేలో వేద అంబానీ జన్మించింది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం