Isha Ambani: ఇషా అంబానీ వేసుకున్న ఈ సాదా సీదా డ్రెస్సు కొనాలంటే మీ నెల జీతం ఖర్చుపెట్టాల్సిందే-you will be surprised to know the cost of this simple dress worn by isha ambani ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Isha Ambani: ఇషా అంబానీ వేసుకున్న ఈ సాదా సీదా డ్రెస్సు కొనాలంటే మీ నెల జీతం ఖర్చుపెట్టాల్సిందే

Isha Ambani: ఇషా అంబానీ వేసుకున్న ఈ సాదా సీదా డ్రెస్సు కొనాలంటే మీ నెల జీతం ఖర్చుపెట్టాల్సిందే

Haritha Chappa HT Telugu

ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ. ఆమె తన భర్తతో కలిసి పింక్ బందనీ డ్రెస్సులో మహా కుంభమేళాకు వచ్చింది. ఆమె చాలా సింపుల్ గా కనిపించింది. ఆమె ఎంత సింపుల్ గా కనిపించినా ఆమె వేసుకున్న డ్రెస్సు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

మహా కుంభమేళాలో ఇషా అంబానీ

ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన భర్త అనంద్ పిరమల్‌తో కలిసి ప్రయాగరాజ్‌లోని మహాకుంభ్ మేళాలో పాల్గొంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి ప్రార్థనలు చేసింది. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో ఇషా పింక్ డ్రెస్సును ధరించింది. ఈ డ్రెస్సు సాదాసీదాగా కనిపిస్తోంది కానీ ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. వేల కోట్లు ఉన్న ఆమె ఒక సాదా డ్రెస్సు కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదంటున్న ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు.

ఇషా అంబానీ ఫ్యాషన్

ఇషా అంబానీ చక్కని ఫ్యాషన్ ఐకాన్. ఆమె ఎంపిక చేసుకునే దుస్తులు ఎంతో అందంగా ఉంటాయి. అద్భుతమైన కుట్టుపనితో కూడిన డ్రెస్సులను ఆమె ఎంపిక చేసుకుంటుంది. ఖరీదైన ఆభరణాలను ధరించి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. తాజాగా ఆమె కుంభమేళాకు ఒక పింక్ డ్రెస్సు వేసుకుని వచ్చింది. ఆ డ్రెస్సు చూస్తే చాలా సింపుల్ గా కనిపిస్తోంది. కానీ ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. ఆమె డ్రెస్సు మెత్తని లాలిపాప్ పింక్ సిల్క్ తో తయారైంది. దానిపై వివిధ బందనీ డాట్ స్కేల్స్ ప్యానెల్స్ ఉన్నాయి. సింపుల్ కనిపిస్తున్నా దీన్ని కొనాలంటే మధ్యతరగతి వారికి ఎంతో కష్టం.

ఈ డ్రెస్సులో ఇషా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ డ్రెస్సులో సంక్లిష్టమైన బంధనీ పని ఉంది, టెక్స్చర్‌ వల్ల దీనికి ప్రత్యేకత వచ్చింది. డబుల్-బటన్ క్లోజర్‌తో పొడవైన కఫ్డ్ స్లీవ్‌లు, ఫినిషింగ్ టచ్‌ ఎంతో అందంగా నప్పాయి.

ఈ డ్రెస్ ధర ఎంత?

మీకు ఇషా డ్రెస్సు బాగా నచ్చిందా? అది మీ వార్డ్ రోబ్ లో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే దీని ఖరీదు మీరు తెలుసుకోవాల్సిందే. దీన్ని ధర అక్షరాలా 71,000 రూపాయలు.

ఇషా డ్రెస్సు ఖరీదు
ఇషా డ్రెస్సు ఖరీదు (www.aleph-gallery.com)

ఆమె తన లుక్‌ను డైమండ్ డ్రాప్ ఈయర్‌రింగ్స్, స్టైలిష్ బ్లాక్ రౌండ్ సన్ గ్లాసెస్‌తో జత చేసింది. నో-మేకప్ లుక్‌తో, ఆమె తన మెరిసే జుట్టును మధ్యలో విడిచి, పోనీటెయిల్‌గా కట్టుకుంది. ఆమె చూసేందుకు ఎంతో అందంగా ఉంది.

ఇషా అంబానీ గురించి

వ్యాపారవేత్తు ముఖేష్, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె 2018లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులు డిసెంబర్ 2022లో కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, పాప.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం