Clock In Shopping Malls : మాల్స్‌లో గడియారాలు ఉండవు.. దీని వెనక ఉన్న రహస్యమేంటి?
Clock In Shopping Malls : షాపింగ్ మాల్స్ వెళితే గడియారాలు పెద్దగా కనిపించవు. మీరు అక్కడే తిరుగుతూ ఉంటారు. దీని వెనక కారణాలు ఏంటో తెలుసా?
భారీ మాల్స్‌లో షాపింగ్ చేసేందుకు వెళ్తారు. తెలియకుండానే.. మీరు అక్కడ గంటలు గడుపుతారు. కొన్నిసార్లు మీరు మాల్ మూసే వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ సిబ్బంది మిమ్మల్ని బలవంతంగా బయటకు పంపించి వేస్తారు. సర్ టైమ్ అయిపోయింది వెళ్లండని చెబుతారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మాల్ లోపల ఎంత సమయం గడుపుతున్నారో మీకు తెలియకుండా అక్కడే ఉంటారు.

మరోవైపు మీరు ఏ మాల్‌లోనూ గోడ గడియారాన్ని చూడలేరు. మాల్స్‌లో అన్నీ ఉంటాయి. ప్రజలను ఆకర్షించేందుకు గోడలపై ఆసక్తికరమైన డిజైన్లు, అలంకరణ వస్తువులు పెడతారు. కానీ అక్కడ చిన్న గడియారం కనిపించదు. మాల్స్‌లో గడియారాలు ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? గడియారానికి మీకు, వారి వ్యాపారానికి ఏం సంబంధమనే ప్రశ్నకు సమాధానం ఏంటో ఆలోచించారా?
మీరు మాల్‌లోకి ప్రవేశించినట్లయితే గడిపే సమయం కూడా అక్కడి కంపెనీల ప్రొడక్ట్స్, వాటి ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది. మాల్‌లో ఎక్కువసేపు గడిపే వారెవరైనా ఒక్కొక్కరు ఒక్కో వస్తువు కొంటూ బయటకు వస్తారు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు.
మీరు మాల్‌లో ఎక్కువసేపు ఉంటే మీ కళ్ళు ఒకదానిపై ఒకటి పడతాయి. మీకు అవసరం లేకపోయినా మీరు దాని ధరను చెక్ చేస్తారు? ముఖ్యంగా అలంకార వస్తువులు, విలాస వస్తువుల ధరలను తనిఖీ చేయడం అందరికీ అలవాటు. తద్వారా మీరు మాల్స్‌లో ఎక్కువ సమయం గడిపేలా చేస్తారు. అదే మాల్‌లో గడియారం ఉంటే మీరు దానివైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో టైమ్ అయిపోతుందని బయటకు వస్తారు.
మాల్ లో గడియారం చూస్తే మీ దృష్టి మరలుతుంది. పెద్ద గడియారంలో సమయం చూస్తే ఇంట్లో పని గుర్తుకు వస్తుందనేది లోతైన మానసిక అంశం. మీరు మాల్స్‌లో గడియారాన్ని చూడలేరు. అక్కడ మీకు ఏ గోడపైనా చిన్న గడియారం కూడా కనిపించదు. ఒకవేళ మాల్స్‌లో గడియారాల దుకాణం ఉంటే అక్కడి గడియారాలు ఒకే సమయం చూపవు. అన్నీ వేర్వేరు సమయాలను చూపుతాయి. తదుపరిసారి మీరు మాల్‌కు వెళ్లినప్పుడు, ఈ పాయింట్లను మీరే చెక్ చేసుకోండి.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బంగోర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం మనం షాపింగ్ చేసినప్పుడు, సందేహాస్పదమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుడదు. మన మెదడు మనల్ని ఆపగలిగే సామర్థ్యాన్ని 20 నిమిషాల వరకే ఉంచుకుంటుంది. అంటే ఆర్థిక ప్రాతిపదికన మనం ఏదైనా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే అది 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. మీరు ఒకే నిర్ణయం గురించి 20 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచిస్తే, మీ ఆర్థిక నిర్ణయం దెబ్బతింటుంది. అప్పుడు మీ మెదడు ఆర్థిక విషయాలపై నియంత్రణ కోల్పోతుంది.
మాల్స్ కూడా ఇదే నిబంధనను అనుసరిస్తారు. మీరు మాల్‌కి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు సమయం ఎంత? మీరు మాల్‌లో ఎంత సమయం గడుపుతున్నారో వీలైనంత వరకు మీకు దూరంగా ఉంచడానికి బిజినెస్ టెక్నిక్ ఇది. ఇలా అన్ని మాల్స్‌లో మంచి సంగీతం, చల్లటి గాలి, పరిమళం, విశ్రాంతి స్థలం, ఆటలు మొదలైనవి డజన్ల కొద్దీ ఎలిమెంట్‌లతో మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇలా మాల్స్‌లో గడియారం పెట్టకుండా ఉండేందుకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. మీకు సమయం తెలియకుండా అక్కేడ ఉండిపోవాలనేది బిజినెస్ ట్రిక్.
టాపిక్