Chicken Wash Tips : చికెన్ ఎలా కడగాలో మీకు కచ్చితంగా తెలియదు.. ఇలా వాష్ చేయాలి-you must know how to wash raw chicken otherwise your kitchen spread with bacteria ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Wash Tips : చికెన్ ఎలా కడగాలో మీకు కచ్చితంగా తెలియదు.. ఇలా వాష్ చేయాలి

Chicken Wash Tips : చికెన్ ఎలా కడగాలో మీకు కచ్చితంగా తెలియదు.. ఇలా వాష్ చేయాలి

Anand Sai HT Telugu
Mar 22, 2024 12:30 PM IST

Raw Chicken Wash Tips : చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. కానీ దానిని ఎలా కడగాలనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. దీంతో కిచెన్‌లో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.

చికెన్ ఎలా కడగాలి
చికెన్ ఎలా కడగాలి (Unsplash)

నాన్ వెజ్ తినేవారికి చికెన్‌తో చేసే రెసిపీలు అంటే చాలా ఇష్టం. దుకాణం వెళ్లి చికెన్ తెచ్చుకుని కొందరు కడగకుండానే తినేస్తారు. అదేంటని అడిగితే.. చికెన్ కడిగితే టేస్ట్ పోతుందని చెబుతారు. కానీ చికెన్ కడగకుండా తింటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుంది. అందుకే చికెన్ కచ్చితంగా కడగాలి. ఆ తర్వాతే వంట చేయాలి.

చికెన్ బిర్యానీ, గ్రేవీ, ఫ్రైస్, రోల్స్, కబాబ్స్, కర్రీ, చికెన్ ప్రియులు కొనుక్కుని ఇష్టానుసారంగా తింటారు. కానీ వంట చేయడానికి ముందు, సాధారణంగా రక్తం, జిడ్డును తొలగించడానికి వంటగదిలో కడగాలి. కానీ చికెన్‌ను కడగడానికి సరైన మార్గం చాలా మందికి తెలియదు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగించడానికి తమ సంతృప్తి కోసం చికెన్‌ను కడుగుతారు. చికెన్ నిజానికి హానికరమైన సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. అయితే వండుకునే ముందు కడిగేసినా అది పోదు.

చికెన్ కడగకుంటే అనారోగ్యం

చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ జెర్మ్స్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. జ్వరం, వాంతులు, వికారం, విరేచనాలు, రక్త ఇన్ఫెక్షన్లు వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, శారీరక బలహీనత ఉన్నవారు ఈ బ్యాక్టీరియా వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

బ్యాక్టీరియా వ్యాపిస్తుంది

మీరు చికెన్‌ను ఎంత కడిగినా అది అన్ని క్రిములను తొలగించదు. ఇది ఉపరితల బ్యాక్టీరియాను మాత్రమే తొలగిస్తుంది. మీరు మీ వంటగదిలో చికెన్‌ను కడిగినప్పుడు బ్యాక్టీరియా మీ వంటగది చుట్టూ వ్యాపించడం ప్రారంభించవచ్చు. ఇది చికెన్ నుండి సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. చికెన్‌ను ఎలా కడగాలి అని మీరు ఆలోచిస్తే దాని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి.

వేడి నీటితో కడగండి

చాలాసార్లు చికెన్‌కు బ్యాక్టీరియా సోకుతుంది. మొదట చికెన్ ఉపరితలం నుండి మురికిని తొలగించి వెంటనే ఇక వండేయకండి. చికెన్ నుండి అన్ని సూక్ష్మజీవులను తొలగించడానికి చికెన్‌ను వేడి నీటిలో కాసేపు ఉడకబెట్టాలని లేదా వేడి నీటిలో బాగా కడగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు

చర్మాన్ని తొలగించాలి

చికెన్ నుండి చర్మాన్ని తొలగించాలని నిర్ధారించుకోండి. చికెన్ బ్రెస్ట్, అన్ని భాగాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ చికెన్ చర్మంలో కొవ్వు మాత్రమే ఉంటుంది.

పసుపుతో వాష్ చేయాలి

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చికెన్‌ను పసుపుతో కడగండి. ఇలా చేస్తే బ్యాక్టీరియా అంతా పోతుంది. కాస్త పసుపు తీసుకుని.. చికెన్ కడుగుతున్న నీటిలో వేయండి. తర్వాత కాసేపటికి చికెన్ వేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు చేతితో కడగండి. ఇప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా పోతుంది. తర్వాత వండుకుని తినవచ్చు.

చాలా మంది షాపు నుంచి తెచ్చిన చికెన్ కడగకూడదనే భ్రమలో ఉంటారు. ఎందుకంటే కడిగితే రుచి పోతుందని అనుకుంటారు. ఇలా చేయడం వలన మీరు ఎంత వండినా అందులోని బ్యాక్టీరియా అలానే ఉంటుంది. మీ కిచెన్‌లో వ్యాపిస్తుంది. అందుకే చికెన్ కచ్చితంగా కడగాలి. మీరు ఇంట్లో చికెన్ ఉడికించినప్పుడల్లా పైన చెప్పిన చిట్కాలను గుర్తుంచుకోండి.

Whats_app_banner