Before Divorce : విడాకులు తీసుకునే ముందు ఈ విషయాలు మాట్లాడండి-you must discuss these topics with each other before divorce ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Before Divorce : విడాకులు తీసుకునే ముందు ఈ విషయాలు మాట్లాడండి

Before Divorce : విడాకులు తీసుకునే ముందు ఈ విషయాలు మాట్లాడండి

Anand Sai HT Telugu

Relationship Tips : భార్యాభర్తల బంధం చాలా గొప్పది. కానీ చిన్న చిన్న కారణాలకే కొందరు విడిపోతూ ఉంటారు. విడాకులు తీసుకోవాలనుకునే ముందు కొన్ని విషయాలు చర్చించండి.

విడాకులు (Unsplash)

ఏ బంధమైనా కూర్చొని మాట్లాడితే బలపడుతుంది. భార్యాభర్తల బంధం కూడా అంతే. మీరు కోపంగా, మౌనంగా ఉంటే దూరమవుతారు. కూర్చొని మాట్లాడితే దగ్గరగా ఉంటారు. ఏదైనా తెగే దాగా లాగొద్దు. మీరు కొన్ని సమస్యలను చర్చించడం ద్వారా సంబంధాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చు. అవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మరొక విషయం ఏంటంటే మీ తప్పులను అంగీకరించడానికి సిగ్గుపడకండి. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా ప్రశాంతంగా వినండి.

చాలా సార్లు భార్యాభర్తల మధ్య వివాదాలు లేదా గొడవలు విడిపోయే స్థాయికి చేరుకుంటాయి. ఆ సమయంలో ఇద్దరూ ఒకే తాటిపై జీవించలేరని నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పరిస్థితిలో విడాకుల చర్చ ప్రారంభమవుతుంది. బంధం కష్టతరమైన దశలో ఉంటే భాగస్వామిని అడగవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు కొన్ని సమస్యలను చర్చించడం ద్వారా సంబంధాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రమే కాకుండా విచ్ఛిన్నమైన సంబంధాలను కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఏమి చర్చించాలో చూడండి.

వివాహేతర సంబంధాలే విడాకులకు అతిపెద్ద కారణం. జీవిత భాగస్వామి వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, భాగస్వామికి అతనిపై నమ్మకం దెబ్బతింటుంది. మళ్లీ విశ్వసించడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో విడాకుల అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ తప్పును అంగీకరించి, మీ వివాహాన్ని విడిపోకుండా కాపాడుకోవాలనుకుంటే మనం ఇది వరకులా ఒకరినొకరు విశ్వసించడం సాధ్యమేనా అని మీ భాగస్వామిని అడగండి. మళ్లీ నమ్మకాన్ని పొగొట్టుకోవద్దు. ఈ ప్రశ్నలకు మీరే అనేక సమాధానాలను కనుగొంటారు. మీ సంబంధం కూడా సేవ్ అవుతుంది. మీరు ఒక వేళ తప్పు చేసి ఉంటే.. నిజమే తెలియక తప్పు చేశానని, ఇకపై చేయనని గట్టిగా చెప్పండి.

విడాకులకు మరో కారణం డబ్బు. విడాకుల తర్వాత డబ్బు లేకపోవడం కూడా అనేక సమస్యలను సృష్టిస్తుంది. మీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు పిల్లల చదువులు, వారి సంరక్షణ, ఇంటి రుణం, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు గురించి బహిరంగంగా చర్చించండి. డబ్బు విషయంలో చిన్నచిన్న సమస్యలపై తగాదాలు పెట్టుకోవడం కంటే విడాకుల ముందు ఈ విషయాలను చర్చించుకోవడం మంచిది. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.

కొంతమంది భాగస్వామి తమను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంటారు. ఇలాంటి విషయాలు చిన్నగా మెుదలై పెద్దగా తయారవుతాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో విడాకుల వరకూ వస్తే.. నేరుగా ఒకే మాట అనండి.. టూర్‌కు ఎక్కడికి వెళ్దామని చెప్పండి. వెంటనే మీ భాగస్వామి ఆలోచనల్లో పడతారు.

భాగస్వామి కుటుంబానికి విలువ ఇవ్వకపోయినా బాధపడుతుంటారు. ఇలాంటివి కూడా పెద్ద గొడవలు అయ్యేందుకు కారణమవుతాయి. బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు దీనిపై చర్చించాలి. మీరు ఎలా ఉంటే భాగస్వామికి ఇష్టమో తెలుసుకోండి.