మోటివేషన్ ఇచ్చే అంశాల కోసం వెదుకుతున్నారా? మనసు తలుపు తెరిచి చూడండి మీ కళ్ల ముందే కనిపిస్తాయ్!-you dont need to go anywhere for motivation many things right before your eyes can motivate you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మోటివేషన్ ఇచ్చే అంశాల కోసం వెదుకుతున్నారా? మనసు తలుపు తెరిచి చూడండి మీ కళ్ల ముందే కనిపిస్తాయ్!

మోటివేషన్ ఇచ్చే అంశాల కోసం వెదుకుతున్నారా? మనసు తలుపు తెరిచి చూడండి మీ కళ్ల ముందే కనిపిస్తాయ్!

Ramya Sri Marka HT Telugu

మోటివేషన్ ఇచ్చే అంశాల కోసం ఎక్కడికో వెళ్లి పుస్తకం కొనుక్కోవడం, లేదా మరెవరో గొప్ప వ్యక్తి మాటలు వినడం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయడం అన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. అలాంటప్పుడు కూడా మీరు మోటివేట్ అవ్వాలంటే మీ కళ్ల ముందున్న ఈ విషయాలు చాలు.

కళ్ల ముందే ఉండే చాలా విషయాలు మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి.

మోటివేషన్ కోసం ఎక్కడికో వెళ్లి, ఏవో మాటలు వినాల్సిన అవసరం లేదు.కళ్ల ముందు కనిపించే ప్రతీది మనల్ని మోటివేట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ కళ్ల ముందున్న ప్రతి వస్తువు, ప్రతి విషయం మీకు పాఠం నేర్పిస్తుంది. మీలో నేర్చుకునే మనస్సు ఉంటే, ప్రతిక్షణం ప్రకృతి పాఠశాలగా కనిపిస్తుంది. చల్లదనాన్ని తీసుకొచ్చే వర్షం, వెలుతురును మోసుకొచ్చే సూర్యోదయం, సమయాన్ని తెలిపే గడియారం ఇలా ప్రతి ఒక్కటి మరుక్షణమే కార్యార్థివై పరుగెత్తమని పురిగొల్పుతాయి.

ఇవన్నీ అర్థం కావాలంటే, యాంత్రిక జీవనం నుంచి కాస్త బయటకు వచ్చి కేవలం కళ్లతోనే కాకుండా మనస్సు తలుపులు తెరిచి ప్రతి అంశాన్ని గమనించండి. మీ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోండి. ఉదాహరణకు మీకు మోటివేషన్ గా నిలిపే అంశాలను కొన్నింటిని మీ ముందుంచుతున్నాం. అవేంటంటే,

మోటివేషన్ అందించే అంశాలు

1. ఉదయ సూర్యోదయం

ప్రతి రోజు కొత్తగా ఉదయించే సూర్యుడు మనకు “ఏది ఏం జరిగినా, ఇప్పటి వరకూ ఏం ఫలితం పొందినా తిరిగి పనిని ప్రారంభించవచ్చు” అనే సందేశం ఇస్తాడు. గతాన్ని వదిలేసి కొత్తగా ముందుకెళ్లమని ప్రోత్సహిస్తాడు.

2. మొక్కలు

విత్తనం, నీరు, కూసింత వెలుతురు ఉంటే చాలు... మొక్క ఎదిగిపోతుంది. మనకి కూడా కావాల్సినవి ఇవే. తగిన పరిసరాలు, ప్రయత్నం, సహనం ఉంటే ఎదగడంలో అడ్డంకులను దాటి ఎదగొచ్చు.

3. వరుణుడు (వర్షం)

ఎండలు ఎంత విపరీతమైన వేడి పుట్టించినా చివరికి వాన కురుస్తుంది. ఇదే జీవితంలోని కష్టాలకూ, మిగతా పరిస్థితులకు ఆపాదించుకోండి. మీరెన్ని కష్టాలతో సతమతమైనా తిరిగి సుఖం వస్తుందని మర్చిపోకండి. కష్టాన్ని నెగ్గితేనే సుఖం పొందగలం.

4. గడియారం

ఏకధాటిగా తిరుగుతూ అలసట అనే ఊసులేకుండా పని చేస్తుంటుంది. టైమ్ వేస్ట్ చేయకుండా, నిరంతరంగా శ్రమించాలనే సందేశాన్ని నెమ్మెదిగా అందిస్తుంది. గడియారం ప్రేరణ కల్పించేందుకు ఒక గొప్ప గురువు.

5. పిల్లల చురుకుతనం

చిన్నారులు ఆడుకుంటూ నేలపై పడిపోతుంటారు. కాసేపు ఏడుస్తారు, కానీ మళ్లీ నవ్వుతారు. వాళ్ల దృక్పథం మనకి “జీవితంలో కష్టాన్ని తట్టుకుని మళ్లీ కష్టపడమని, బాధలను తేలికగా తీసుకోమని”, విఫలమైనా మళ్ళీ నవ్వుతూ లేవమని నేర్పుతుంది.

6. నదులు

ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటి ఆకారం మార్చుకుంటూ ముందుకు పోతాయి. ఇది మనం కూడా అడ్డంకులు కలిగితే ఎదిరించి గెలవాలనే మొండితనం చూపించకుండా, సమయానుకూలంగా వ్యవహరిస్తూ సమస్యలను దాటేయాలి.

7. పశుపక్షులు

వాటికి భవిష్యత్తు భయం లేదు, అయినా ప్రతిరోజూ తమ పని చేసుకుంటూ జీవించేస్తాయి. మనం కూడా భవిష్యత్ భయంతో, ఏమైపోతామోననే బెంగతో బతకడం కంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని ఆస్వాదించడమే అసలైన జీవితం.

8. ఆవిరి – మూతను కదలించడం

ఒత్తిడి పెరిగితే, అది బయటికొచ్చేదాకా మనం నెమ్మదిగా వ్యవహరించాలి. ఆవిరిని అదిమిపెట్టే మూతలా మారాలి. వేడి తగ్గిపోతే ఆవిరి తిరిగి కూల్ అవుతుంది. మూతను ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే లైఫ్‌లో ఏ విషయం వల్ల అయినా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు కాస్త నెమ్మెదైన వైఖరి ప్రదర్శించాలి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం